Moviesబ్రేకింగ్: సినీ నటుడు చలపతిరావు హఠాన్మరణం.. కెరియర్లో హైలెట్స్ ఇవే..!

బ్రేకింగ్: సినీ నటుడు చలపతిరావు హఠాన్మరణం.. కెరియర్లో హైలెట్స్ ఇవే..!

టాలీవుడ్ ను వ‌రుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్ప‌టికే ఈ ఏడాది ఎంద‌రో సినీ ప్రముఖులు క‌న్నుమూశారు. మొన్న‌టికి మొన్న నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయారు. ఈయ‌న మృతిని మరువక ముందే తాజాగా టాలీవుడ్ లో మ‌రో విషాదం చోటుచేసుకుంది. ప్ర‌ముఖ సీనియ‌ర్ నటుడు చలపతి రావు కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు.

హైదరాబాద్‌లోని తన నివాసంలోనే గుండెపోటుతో చలపతిరావు తుది శ్వాస విడిచారు. చ‌ల‌ప‌విరావు రావు ఆక‌స్మిక మ‌ర‌ణంతో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెల‌కొంది. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాలంటూ ప‌లువురు సినీ ప్రిముల‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. 1944 మే 8న క్రిష్ణా జిల్లా బల్లిపర్రులో చలపతి రావు జన్మించారు.

1966లో కృష్ణ నటించిన `గూఢచారి` సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన చ‌ల‌ప‌తి రావు.. ఇన్నేళ్ల కెరీర్ లో పన్నెండు వందలకు పైగా సినిమాల్లో న‌టించారు. విభిన్న‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ చలపతి రావు పని చేశారు. ఇక చ‌ల‌ప‌తి రావుకు ఇద్ద‌రు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు. కూతుళ్లు అమెరికాలో సెటిల్ అయ్యారు. కుమారుడు ర‌విబాబు తండ్రి బాట‌లోనే ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా రాణిస్తున్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news