టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ వచ్చే సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత బాలయ్య నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే బాలయ్యకు.. మరో సీనియర్ హీరో నాగార్జునకు మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారం గత 7 – 8 సంవత్సరాలుగా టాలీవుడ్ లో నడుస్తోంది. బాలయ్య ఎప్పుడు నాగార్జున సినిమా ఫంక్షన్లు.. ఇంట్లో ఫంక్షన్లకు హాజరైన సందర్భాలు లేవు.
అలాగే నాగార్జున కూడా బాలయ్య సినిమా ఫంక్షన్లతో పాటు ఆయన ఇంట్లో జరిగిన ఫంక్షన్లకు వస్తున్న దాఖలాలు లేవు. ఎప్పుడో నాగచైతన్య జోష్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో మాత్రమే బాలయ్య కనిపించారు. అయితే వీరిద్దరి మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారం బాగా జరుగుతున్న సమయంలో టి సుబ్బిరామిరెడ్డి నిర్వహించిన ఓ ఫంక్షన్ లో నాగార్జున మాత్రం తమ ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. బాలయ్య సమక్షంలోనే క్లారిటీ ఇచ్చారు.
వైజాగ్ లో జరిగిన ఈ ఫంక్షన్ లో బాలయ్య చేతిలో చేయి వేసి నాగార్జున చెప్పినప్పుడు బాలయ్య ముభావంగా తల ఊపారే తప్ప… నోటితో మాత్రం అవునని కాదని ఖండించనూ లేదు. నాగార్జున తమ ఇద్దరి మధ్య ఏం ? లేదని క్లారిటీ ఇచ్చినా కూడా ఆ తర్వాత వీరిద్దరూ కలుసుకున్న సందర్భాలు లేవు. నాగార్జున తండ్రి ఏఎన్నార్ మృతి చెందినప్పుడు కూడా బాలయ్య ఆ ఇంటి వైపు వెళ్లలేదు.
అలాగే అంతకుముందు నాగార్జున – ఏఎన్ఆర్ కోసం సినీ ప్రముఖులతో నిర్వహించిన భారీ ఫంక్షన్‌కు ఇండస్ట్రీ ప్రముఖులు అందరిని ఆహ్వానించి… బాలయ్యను మాత్రం ఆహ్వానించలేదు. అప్పటినుంచి వీరిద్దరి మధ్య గ్యాప్ బాగా పెరిగింది అన్న ప్రచారం ఉంది. దాదాపు 8 సంవత్సరాలకు పైగా వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు లేవని ఇండస్ట్రీ వర్గాలు చెబుతూ ఉంటాయి.
అయితే తాజాగా నాగార్జున బిగ్‌బాస్ హోస్టింగ్‌కు గుడ్ బై చెప్పేసినట్టు తెలిసింది. బిగ్‌బాస్ నెక్ట్స్ సీజన్ నుంచి నాగార్జున ప్లేస్‌లో బాలయ్య హోస్ట్ అవుతాడనే అంటున్నారు. అయితే తాను బిగ్‌బాస్ షో హోస్ట్ చేయాలంటే బిగ్‌బాస్ సెట్ కూడా అన్నపూర్ణ స్టూడియోలో ఉండకూడదని బాలయ్య ఖండీషన్ పెట్టారని అంటున్నారు. ఇదే నిజమైతే వీరిద్దరి మధ్య గ్యాప్ అలాగే ఉందనే అనుకోవాలి.