రెండు దశాబ్దాల క్రితం ప్రత్యూష టాలీవుడ్ లో ఒక క్రేజీ హీరోయిన్.. వర్ధమాన హీరోయిన్. చాలా తక్కువ టైంలోనే ఎంతోమంది అభిమానుల మనసులను గెలుచుకుంది. అందంతో పాటు అభినయం.. చూడ చక్కటి రూపం.. మంచి నటన, తెలుగు అమ్మాయి కావడంతో ప్రత్యుషకు మంచి అవకాశాలు వచ్చాయి. మోహన్ బాబు నటించిన రాయుడు సినిమాలో ఆయనకు కుమార్తెగా నటించింది. ఆ తర్వాత అక్కినేని మనవడు సుమంత్ స్నేహమంటే ఇదేరా – దివంగత వర్ధమాన హీరో ఉదయ్ కిరణ్ కలుసుకోవాలని సినిమాలలో కూడా హీరోయిన్ గా నటించింది.
ఆ తర్వాత తెలుగులో మంచి అవకాశాలు వస్తుండగానే… 2002 ఫిబ్రవరిలో అనుమానాస్పద రీతిలో ప్రత్యూష మృతి చెందింది. ప్రత్యూష తన ప్రియుడు సిద్ధార్థ రెడ్డితో ప్రేమలో ఉందని.. ఆమె ప్రేమకు ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని ప్రచారం జరిగింది. అయితే ప్రత్యూష తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తెది ఆత్మహత్య కాదని… తమ కుమార్తె పై సిద్ధార్థ రెడ్డి తో పాటు అతడు స్నేహితులు అత్యాచారం చేసి చంపేశారని కోర్టుకు ఎక్కారు.
అయితే ప్రత్యూష చనిపోయాక తన కుమార్తె ఒంటి మీద ఉన్న నగలు, ఇతర వస్తువులు అన్ని ఇచ్చారని.. అయితే ఆమె దుస్తులు మాత్రం ఇవ్వలేదని చెప్పారు. హాస్పటల్ వర్గాలు దుస్తులు అడిగితే తాము ఇవ్వమని చెప్పాయని సరోజినీ దేవి వాపోయింది. తన కుమార్తెపై దారు గెస్టు హౌస్‌లు మార్చి మార్చి చరిచారు ( అత్యాచారం) అని.. దుస్తులపై స్పెర్మ్ ఉందని… అందుకే వాటిని హాస్పటల్ వాళ్లు దాచేసి… సాక్ష్యాలు లేకుండా ప్రయత్నించారని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఇక ఇద్దరు కలిసి విషం తాగితే ఇద్దరు చనిపోవాలి కదా ? తన కుమార్తె మాత్రమే ఎలా చనిపోయిందని… తన కుమార్తెపై అత్యాచారం చేసి చంపేశారని.. తాను ఎన్నోసార్లు.. ఎన్నో కోర్టుల చుట్లూ తిరిగినా.. తన కుమార్తె చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఇప్పటకీ తమకు న్యాయం జరగలేదని ఆమె వాపోయారు.