సినీరంగంలో బంధుత్వాలు ఇప్పుడు మాత్రమే కాదు.. గతంలోనూ అంటే.. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోనూ ఉండేవి. సంగీత దర్శకుడు ఆదినారాయణరావ్-మహామేటి నటి అంజలీదేవి ఇద్దరూ దంపతులు. అదేవిధంగా సావిత్రి-జమినీ గణేష్ కూడా భార్యాభర్తలు (ఈ విషయం తెలిసిందే). ఇక, ఇలా చాలా మంది మధ్య బంధుత్వాలు ఉండేవి. ఇలానే మేటి హాస్య నటుడుగా గుర్తింపు పొందిన రాజబాబుకు కూడా సినీ రంగంలో బంధుత్వం ఉంది.
ఈయన తెరమీద కనిపిస్తే.. చాలా నవ్వని వారు ఉండరు కదా! ఇప్పుడు బ్రహ్మానందం టైపులో! సినిమా సాంఘికమా.. జానపదమా.. చారిత్రకమా అనేది తేడా లేదు. రాజబాబు ఉన్నాడంటే..నవ్వులు పూయాల్సిందే! ఇక, మరొక వ్యక్తి ఉన్నారు. (సారీ ఇది చిన్నపదం). ఆయన మహాశక్తి! కలం పట్టారంటే.. అవినీతి, బంధు ప్రీతిపై నిప్పులు చెరగాల్సిందే. సమాజంలోని సమస్యలపై నిలదీతలు సాగాల్సిందే. ఆయనే మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు.. మనం గౌరవంగా పిలుచుకునే శ్రీశ్రీ.
ఈ శ్రీశ్రీ.. ఆ రాజబాబు.. ఇద్దరూ కూడా స్వయానా తోడళ్లుళ్లు..! ఈ పరిచయం.. ముందుకన్నా.. తర్వాత ఇండస్ట్రీలో బాగా వీరిని కలిపింది.. వీరికి ఉన్న కొన్ని అలవాట్లే. సినిమా షూటింగుల సమయంలో శ్రీశ్రీ స్టూడియోల్లో ఉండేవారు. ఎందుకంటే.. ఆయనకు డైలాగులపై కూడా పట్టుంది. అదే సమయంలో పద్యాలు… పాటలు కామన్. ఇక, అప్పట్లో రాజబాబులేని సినిమా ఉండేది కాదు.
దీంతో వీరిద్దరూ కలిశారంటే.. దమ్ము లాగాల్సిందే!! రాజబాబు.. శ్రీశ్రీని అన్నయ్య అంటే.. శ్రీశ్రీ.. ఆయనను తమ్మయ్య అని పిలిచేవారు. అయితే.. ఎవరు ఎంత నిష్ణాతులైనా.. ఒకరి పని విషయంలో మరొకరు జోక్యం చేసుకునేవారు కాదు. కానీ,కలిసి అనేక పార్టీల్లో పాల్గొన్నారు.. అనేక చోట్లకు తిరిగారు. ఏనాడూ.. గౌరవం ఇచ్చిపుచ్చుకోవడంలో వెనక్కి తగ్గలేదు. ఈ ఇద్దరి బంధుత్వం గురించి చెప్పాలనేదే.. ఈ స్టోరీ!