Moviesఆ హీరోయిన్ తో సినిమానా.. వద్దు బాబోయ్ వద్దు.. డైరెక్టర్ కి...

ఆ హీరోయిన్ తో సినిమానా.. వద్దు బాబోయ్ వద్దు.. డైరెక్టర్ కి దండం పెట్టేసిన మహేష్ బాబు..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ , హీరోస్ తెర పై జత కట్టి నటించారు. అలాంటి వారిలో కొందరు జంటలను చూస్తే భలే ముచ్చటగా అనిపిస్తుంది. అఫ్కోర్స్ వాళ్ళ మధ్య ఏజ్ గ్యాప్ ఉన్నా.. వాళ్ళు రియల్ కపుల్ కాకపోయినా సరే ..తెరపై వాళ్ళ జంట చూస్తే మాత్రం కెవ్వు కేక అనిపిస్తుంది. అలాంటి జంటల లో ఒకరే మహేష్ బాబు – సమంత. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా ఫేమస్ అయిన మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే .

అందానికి అందం పద్ధతికి పద్ధతి ఏ హీరోయిన్ తో నటించిన సరే చాలా జాగ్రత్తగా తనపై గాసిప్స్ రాకుండా ఉండేలా ప్లాన్ చేసుకునే మహేష్.. సమంత విషయంలో మాత్రం ఆ గాసిప్స్ రాకుండా ఆపలేకపోయాడు . మహేష్ బాబు – సమంత జంటకు వెండితెరపై మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . వీళ్ళ కలిసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, దూకుడు, బ్రహ్మోత్సవం సినిమాలలో నటించి మంచి జంట గా పేరు సంపాదించుకున్నారు.

అంతేకాదు బ్రహ్మోత్సవం సినిమా తప్పిస్తే అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. నిజానికి బ్రహ్మోత్సవం సినిమాలో సమంత హీరోయిన్గా అని తెలుసుకున్న మహేశ్ ఆమెను8 హీరోయిన్ గా వద్దు అన్నాడట. దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తర్వాత సమంత – మహేష్ బాబు మధ్య ఫ్రెండ్షిప్ ఎక్కువ పెరిగిపోయింది . వాళ్ళ మధ్య ఎంత చనువు పెరిగిపోయిందంటే..సెట్స్ లో చిన్న పిల్లలు లాగా అల్లరి చేసేవారట. మరీ ముఖ్యంగా సమంత- మహేష్ బాబుతో చేసిన అల్లరి ఇప్పటికీ మర్చిపోలేంటో చెప్పుకొస్తున్నారు కొందరు మూవీ మేకర్స్.

ఈ క్రమంలోని బ్రహ్మోత్సవం సినిమాలో హీరోయిన్గా సమంత ఉంటే నేను నటించలేను అంటూ మహేష్ బాబు ఫన్నీగా డైరెక్టర్ కు చెప్పుకొచ్చాడట . అంతే కాదు సమంత మహేష్ బాబు కోసమే ఈ సినిమా ఒప్పుకుంది అంటూ టాక్ వినిపించింది. ఏది ఏమైనా సరే మంచి ఫ్రెండ్స్ గా ఉన్న మహేష్ – సమంత మరోసారి తెరపై కనిపిస్తే బాగుంటుంది అని ఫాన్స్ కోరుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news