పద్దతిగా కనిపించే హీరోయిన్స్ ఒక వర్గానికి మాత్రమే నచ్చుతారు. ఆ వర్గమే ఫ్యామిలీ ఆడియన్స్. అయితే, అందరు హీరోయిన్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించలేరు. అలాగే అందరు హీరోయిన్స్ కమర్షియల్ హీరోయిన్స్‌గా రాణించలేరు. మన తెలుగుతో పాటు మిగతా సౌత్ ఇండస్ట్రీలలో బాలీవుడ్‌లో కమర్షియల్ హీరోయిన్స్ అంటేనే క్రేజ్ ఎక్కువ.
కమర్షియల్ హీరోయిన్స్ గురించి కొన్నేళ్ళ పాటే చెప్పుకుంటారు. సావిత్రి, జమున, సౌందర్య లాంటి ఫ్యామిలీ హీరోయిన్స్ గురించి మాత్రం కొన్ని జనరేషన్స్ మాట్లాడుకుంటారు. అయితే, ఇండస్ట్రీకి ఇద్దరూ చాలా ముఖ్యం. హీరోయిన్ లేని సినిమాలు అతికొద్ది శాతమే ఉన్నాయనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇండస్ట్రీలో హీరోలు ఎంతగా శాసిస్తున్నారో కమర్షియల్ హీరోయిన్స్ అంతగా తమ సత్తా చాటుతున్నారు.
అందుకే, కీర్తి సురేష్ లాంటి ఫ్యామిలీ అండ్ డీసెంట్ హీరోయిన్స్ కూడా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ తెచ్చుకొని కొనసాగాలంటే అన్ని రకాలుగా మారాల్సి వస్తోంది. కమర్షియల్ హీరోయిన్ అంటే మినిమం ఎక్స్‌ఫోజింగ్ చేయాలి. లేదంటే ఆడియన్స్ సినిమాను పట్టించుకోరు. ప్రస్తుతం ఇదే పంథా కొనసాగుతోంది. అందుకే కీర్తి సురేష్ సర్కారు వారి పాట సినిమాలో తన రేంజ్‌ను మించి ఎక్స్‌ఫోజింగ్ చేసింది.
ఇది చూడటానికి ప్రతీ ప్రేక్షకుడికి నచ్చింది. కీర్తి మాస్ సాంగ్స్, అందాల ఆరబోత అన్నీ రకాల ఆడియన్స్‌ను ఆకట్టుంది. తొడలను చూపించి, ఎద అందాలను బయటపెట్టి.. కీర్తి షాకిచ్చింది. ఇదంతా తను మంచి కమర్షియల్ హీరోయిన్ అనిపించుకునేందుకే. కానీ, అది బెడిసికొట్టింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న కీర్తికి సర్కారు వారి పాట కూడా ఫ్లాప్‌గా నిలిచింది. ప్రస్తుతం తెలుగులో కీర్తి సినిమా అవకాశాలు రావడం లేదంటున్నారు.