Moviesఇంట్రెస్టింగ్: అన్ స్టాపబుల్ లో ప్రభాస్ నోటి నుండి ఎక్కువ వినిపించిన...

ఇంట్రెస్టింగ్: అన్ స్టాపబుల్ లో ప్రభాస్ నోటి నుండి ఎక్కువ వినిపించిన పదం ఇదే..గమనించారా..!!

ప్రజెంట్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది అన్ స్టాపబుల్ 2. ఈ షో కి గెస్ట్ గా వచ్చినా ప్రభాస్ ప్రోమో ని నిన్న సాయంత్రం రిలీజ్ చేసారు మేకర్స్. ఈ ప్రోమో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో నెంబర్ వన్ పొజిషన్లో దూసుకుపోతుంది, మరీ ముఖ్యంగా బాలయ్య – ప్రభాస్ ని ఒక్కే తెర పై చూడడం అభిమానులకి చాలా చాలా హ్యాపీగా అనిపించింది . అందుకే ఈ ప్రోమోని పదేపదే రిపీట్ చేసి మరీ చూస్తున్నారు.

కాగా ప్రభాస్ ప్రోమో గురించి సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ న్యూస్ వరైల్ గా మారింది. ఈ ప్రోమోలో మొత్తంగా ప్రభాస్ ఒక పదాన్ని ఎక్కువగా వాడుతూ వచ్చాడు .దానే ట్రెండ్ చేస్తున్నారు రెబల్ ఫ్యాన్స్. మనం బాగా గమనించిన్నట్లయితే. బాలయ్య ప్రభాస్ ని స్టేజి పైకి పిలిచినప్పటి నుంచి కృష్ణంరాజుకి నివాళులర్పించే వరకు ప్రభాస్ ఎక్కువగా వాడిన పదం” ఓరేయ్.. ఓరేయ్-ఓరేయ్” ఈ పదాన్ని ఎక్కువగా మాట్లాడుతూ తమ ఫ్రెండ్షిప్ మధ్య ఉన్న చనువుని అందరికీ తెలిసేలా చేశాడు .

ఫోన్లో రాంచరణ్ తో మాట్లాడుతున్నప్పుడు “ఓరేయ్ చరణ్ నువ్వు నా ఫ్రెండ్ వా శత్రువువా అంటాడు . అంతేకాదు గోపీచంద్ స్టేజిపై కి ఎంట్రీ ఇవ్వగానే.. రాణీ మ్యాటర్ ని బయట పెడుతూ..ఒరేయ్ అంటూ బాలయ్య సార్ మీరు తప్పకోండి అంటాడు. బాలయ్య వాళ్ళని ప్రశ్నిస్తున్నప్పుడు “ఓరేయ్ నాకైతే లేదు నీకు ఏమైనా ఉంటే చెప్పుకో “అంటూ ఫన్నీగా మాట్లాడుతాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ ఊతపదం ఒరేయ్ అంటూ జనాలు , రెబల్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే చాలా సంవత్సరాల తర్వాత ఓ తెలుగు టాక్ షోలో ప్రభాస్ ని చూడడం చాలా ఆనందంగా ఉంది అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆ వీడియోని ట్రెండ్ చేస్తున్నారు. పూర్తి ఎపిసోడ్ డిసెంబర్ 30న స్ట్రీమింగ్ అవుతుంది అంటూ అఫీషియల్ గా ప్రకటించింది ఆహా.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news