టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప మూవీ సరిగ్గా ఏడాది కిందట టాలీవుడ్ లో రిలీజ్ అయింది. కరోనా సెకండ్ తర్వాత బాలయ్య నటించిన అఖండ సినిమా రిలీజ్ అయ్యాక… రెండు వారాల తర్వాత పుష్ప థియేటర్లలోకి దిగింది. రెండేళ్ల క్రితం అలవైకుంఠపురంలో లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత బన్నీ నటించిన పుష్పపై మంచి అంచనాలు ఉన్నాయి. ప్రేక్షకుల అంచనాలు అందుకున్న పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
విచిత్రం ఏంటంటే ఎలాంటి ప్రమోషన్లు చేయకపోయినా… ఎలాంటి అంచనాలు లేకపోయినా బాలీవుడ్లో ఈ సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టి ఇండియన్ సినిమా ట్రేడ్ వర్గాలను సైతం అవురా అనిపించింది. ఈ సినిమాలో బన్నీ మేనరిజమ్స్ తో పాటు… బన్నీ చెప్పిన డైలాగులు… సమంత చేసిన ఉ అంటావా మావా ఐటెం సాంగ్ అదిరిపోయాయి. కేరళతో పాటు కన్నడంలోనూ ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది. ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ సినిమా గురించి చర్చ జరిగింది. అయితే ఆశకు హద్దు ఉండదన్నట్టుగా పుష్ప సినిమాను రీసెంట్గా మేకర్లు రష్యన్ భాషలోకి అనువదించి భారీ ఎత్తున రిలీజ్ చేశారు.
అక్కడితో ఆగకుండా స్థాయిలో ఈ సినిమాను ఇంటర్నేషనల్ వైడ్ గా సూపర్ హిట్ చేయాలని కంకణం కట్టుకున్నారు మేకర్స్. బన్నీతో పాటు సుకుమార్, రష్మిక, దేవిశ్రీప్రసాద్ వీళ్లంతా రీసెంట్గా రష్యా వెళ్లి మరి ఈ సినిమాను గట్టిగా ప్రమోట్ చేశారు. ఇందుకోసం ఏడు కోట్ల వరకు బడ్జెట్ అయినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఈ సినిమా మేకర్స్ కు బాలీవుడ్ నుంచి రు. 100 కోట్ల వసూళ్లు రావడంతో భారీ లాభాలు వచ్చాయి.. రష్యాలో కూడా సూపర్ హిట్ అవుతుందన్న ఆశలతో అక్కడ ఏకంగా ఏడు కోట్లు పెట్టి మరి ప్రమోషన్లు చేశారు.
రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సినిమాను రష్యన్లు డిజాస్టర్ చేసేసారు. అసలు కనీస స్పందన కూడా కరువైంది. కోట్లు ఖర్చుపెట్టి ప్రమోషన్లు చేస్తే అసలు థియేటర్లో మెయింటెనెన్స్ ఖర్చులు కూడా రాలేదట. డిసెంబర్ 8న ఈ సినిమా అక్కడ రిలీజ్ కాగా వారం రోజుల్లో రష్యన్ వెర్షన్ గురించి.. ఈ సినిమా మేకర్లు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంటే సినిమా పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో తెలుస్తోంది. అక్కడ సినిమాకు ఒక మోస్తరు టాక్ వచ్చినా అల్లు అర్జున్ పీఆర్ టీం ఎంత హడావిడి చేస్తుందో చెప్పక్కర్లేదు. ఇప్పుడు వాళ్లంతా అయిపోయారు.. దీనిని బట్టి రష్యాలో పుష్ప సినిమా వాషౌట్ అయిపోయినట్టు తెలుస్తోంది.