ఈటీవీ ప్రభాకర్ భలే జోరు మీద ఉన్నాడు..పెద్ద నిర్మాతలతో చిన్న సినిమా రూపొందించి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు..ఆయన తొలి సినిమా ‘నెక్స్ట్ నువ్వే’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఐతే ఈ సినిమా విడుదల కాకముందే దర్శకుడిగా ఇంకో రెండు అవకాశాలు వచ్చాయని.. అందులో ఒక సినిమా పూర్తి కావస్తోందని ప్రభాకర్ చెప్పడం విశేషం.దర్శకుడు మారుతి ప్రొడక్షన్లో ఓ సినిమా చేస్తున్నానని.. ఆ సినిమా 75 శాతం పూర్తయిందని వెల్లడించాడు. అలాగే మరో సినిమాకు స్క్రిప్టు పూర్తయిం దని.. స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో ఆ సినిమా ఉంటుందని అతను చెప్పాడు.
ఇక తన తొలి సినిమాగా తాను ఓ రీమేక్ చేయడానికి ఇష్టపడలేదని.. ఐతే బన్నీ వాసు ‘యామిరుక్కు భయమే’ సినిమా చూపించాక తన ఆలో చన మారిందని.. ఈ సినిమా మూల కథ తీసుకుని.. తన క్రియేటివిటీని జోడించి సినిమా తీశానని ప్రభాకర్ చెప్పాడు. ఈ సినిమా తీసేందుకు రెండే ళ్ల కిందటే అన్నీ రెడీ అయినప్పటికీ రీమేక్ హక్కుల విషయంలో వివాదం వల్ల ఏడాదిన్నర పాటు ఎదురు చూడాల్సి వచ్చిందని.. చివరికి అన్ని ఇబ్బందులూ తొలగిపోయి ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లిందని.. కేవలం 37 రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేశానని ప్రభాకర్ తెలిపాడు. యాంకర్ గా రాణించిన ప్రభాకర్ డైరెక్టర్గా ఎన్ని మార్కులు కొడతాడో చూడాలిక