సినిమా ఇండస్ట్రీలో శ్రీదేవికి ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకించి చెప్పిన అవసరం లేదు . తెలుగులో , హిందీలో స్టార్ హీరోయిన్గా కొన్ని దశాబ్దాలు ఇండస్ట్రీ ని ఏలేసిన శ్రీదేవి.. దుబాయిలో అనుమానస్పద స్థితిలో మృతి చెందింది . ఇప్పటికీ ఆమె మరణానికి గల కారణాలు బయటపడలేదు . బాత్రూంలో కాళ్లు జారి పడింది అని చెబుతున్నా.. సరైన ఆధారాలు లేవు . దీంతో దుబాయ్ గవర్నమెంట్ కూడా బాత్రూంలో కాలుజారి పడింది అంటూ మేటర్ ని క్లోజ్ చేసింది .
కాగా అప్పటివరకు నాలుగు గోడల మధ్య బిక్కు బిక్కుమంటూ పెరుగినటువంటి జాన్వీ ..ఫ్రీ బార్డ్ గా మారిపోయింది. అమ్మ చనిపోయిన బాధ ఉన్నా సరే ఆ తర్వాత ఆమె పూర్తిగా హద్దులు మీరి ప్రవర్తిస్తుంది . మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో ప్రతిరోజు జాన్వీ కపూర్ ఏదో ఒక హాట్ టాపిక్ తో ట్రెండ్ అవుతూనే ఉంటుంది . మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ చిట్టి పొట్టి బట్టలు వేసుకున్న హాట్ ఫోటోషూట్స్ ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటాయి .
దీంతో శ్రీదేవి ఫ్యాన్స్ చాలా బాధపడిపోతున్నారు. మీ అమ్మ బ్రతికి ఉంటే నిన్ను ఇలా పెరగనిచ్చేది కాదని ..నీకు తండ్రి ఉన్న నిన్ను గాలికి వదిలేసాడు అని ..పట్టించుకోవట్లేదని కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు నిన్ను తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్గా చూడడం అనేది మీ అమ్మగారి కళ అని ..కానీ మంచి మంచి స్టోరీస్ వస్తున్నా నీ తండ్రి బోనీకపూర్ డబ్బు మీద మోజుతో మీ కెరీర్ ని నాశనం చేస్తున్నాడని ..నువ్వైనా నిద్ర మేల్కొని తెలుగులో సినిమాలు చేసి మీ తల్లి ఆఖరి కోరిక నెరవేర్చమని జాన్వీకి సలహా ఇస్తున్నారు . అంతేకాదు ముందు ఆ పొట్టి బట్టలు వేసుకోవడం మానేస్తే నీలో శ్రీదేవిని మేము చూసుకుంటామని కామెంట్స్ చేస్తున్నారు . చూడాలి మరి శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో..?