తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నాచురల్ స్టార్ నాని గురించి ఎంత చెప్పినా తక్కువే . ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడమే ..కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా ఎదిగి ఇప్పుడు స్టార్ హీరోగా ఇండస్ట్రీలో ఉండే టాప్ టెన్ హీరోస్ లో ఒకరుగా నిలబడడం అంటే మాటలు కాదు . దాని వెనకాల ఎన్నో కష్టాలు ..హార్డ్ వర్క్ ఉంటుంది . అయితే కొందరు స్టార్ సన్స్ నేచురల్ స్టార్ నానిని హీరోగా ఎదగనీకుండా తొక్కేసిన ..తన సినిమాలు రిలీజ్ అయ్యే టైంలో థియేటర్స్ ఎక్కువ ఇవ్వకపోయినా సరే.. తన కంటెంట్‌తో తన కథతో హిట్ కొట్టి తానేంట్లో ప్రూవ్ చేసుకున్నాడు నాని.
అలాంటి హీరో సినిమాకి నో చెప్పి బిగ్గెస్ట్ తప్పు చేసింది యంగ్ బ్యూటీ. మనకు తెలిసిందే నాని సినిమా హిట్ కన్నా సినిమా ద్వారా జనాలు ఎంత ఎంజాయ్ చేసారా అన్నదే చూస్తారు . ఈ క్రమంలోనే ఫ్లాప్ అయిన సినిమాలు సైతం నాని అభిమానులకు నచ్చిన మూవీస్ కూడా ఉన్నాయి. కాగా రీసెంట్ గా నాని చేస్తున్న సినిమా “దసరా”. ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట ప్రజెంట్ క్రేజ్ ఉన్న ఓ హీరోయిన్ ని అనుకున్నారట.
అయితే ఆ హీరోయిన్ తో కంపేర్ చేస్తే నాని రేంజ్ కూసింత తక్కువ కావడంతో అమ్మడు రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది . అయితే ఇంటర్వ్యూలో యాంకర్ అడిగినప్పుడు మాత్రం “నాని హైట్ కి నా హైట్ కి మ్యాచ్ అవ్వదని.. నాని ఫేస్ చాలా చిన్నగా ఉంటుందని నా ఫేస్ చాలా బ్రాడ్ గా ఉంటుందని ..తెరపై మా జంట చూస్తే బ్రదర్ అండ్ సిస్టర్స్ లా అనుకుంటారని “చెప్పుకొస్తుంది . అదే అమ్మడు గతంలో తనకంటే హైట్ తక్కువ ఉన్న హీరోతో నటించి హిట్ అందుకుంది . మరి అప్పుడు రాని డిఫరెన్స్ ఇప్పుడు ఎలా వస్తుందని అభిమానులు పాయింట్ అవుట్ చేస్తున్నారు . అంతేకాదు ఆమె కావాలని నానిని దిగజార్చడానికి ఇలా చేసిందని నాని ఫాన్స్ మండిపడుతున్నారు . ఏది ఏమైనా సరే నాని రేంజ్ ఏంటో అందరికీ తెలుసు . దసరా సినిమా ద్వారా హిట్ కొట్టి ఆ హీరోయిన్ నోరు మూయించే విధంగా నాని అభిమానులు ప్లాన్ చేసుకుంటున్నారు.