ఈ యేడాది దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒక్క టాలీవుడ్‌లోనే వందల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఈ వేల సినిమాల్లో మోస్ట్ పాపులర్ సినిమాలు ఏవి ? ఎక్కువుగా ప్రేక్షకులను మెప్పించిన సినిమాలు ఏవి ? దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అనుకుంటోన్న సినిమాలు ఏంటి ? IMDb సర్వేలో టాప్ -10లో వచ్చిన సినిమాలు ఏవో చూద్దాం. అయితే ఇందులో కొన్ని అదిరిపోయే ట్విస్టులు కూడా ఉన్నాయి.
IMDb సర్వే ప్రకారం ఈ యేడాది జనవరి 1 నుంచి నవంబర్ 7 వరకు దేశంలో థియేటర్లలోనూ, డిజిటల్‌గాను రిలీజ్ అయ్యి సగటున 25 వేల ఓట్లు కలిగిన సినిమాలనే ఈ సర్వేకు తీసుకున్నారు. అలాగే
IMDb వినియోగదారు రేటింగ్ 7 లేదా అంతకంటే ఎక్కువ ఇస్తేనే ఇక్కడ సర్వే కోసం తీసుకున్నారు. ఈ లిస్టులో మన తెలుగు సినిమా త్రిబుల్ ఆర్ టాప్ – 1లో నిలిచింది. ఇది నార్త్ సినిమా అయినా ఉత్తరాదిలోనూ ఈ సినిమా గురించి ఎక్కువ చర్చ జరిగింది.
ఇక రెండో స్థానంలో కేజీఎఫ్ 2 నిలుస్తుందని అందరూ అనుకున్నారు. అయితే ఆ ప్లేస్ ది కశ్మీర్ ఫైల్స్‌కు దక్కింది. కేజీఎఫ్-2కు యూజర్ రేటింగ్ ఎక్కువగానే ఉన్నా కశ్మీర్ ఫైల్స్‌కు ఎక్కువ హిట్ ఉండడంతో సెకండ్ ప్లేస్‌కు వచ్చింది. కేజీఎఫ్ 2కు మూడో ప్లేస్ దక్కింది. ఇక కమల్ హాసన్‌కు చాలా రోజుల తర్వాత విక్రమ్ రూపంలో సూపర్ హిట్ వచ్చింది. ఈ సినిమాకు 4 వస్థానం రాగా, రిషబ్ శెట్టి కాంతారా సినిమాకు 5వ స్థానం దక్కింది.
ఇక IMDb టాప్-10 సినిమాలలో టాప్ 5లో నాలుగు సినిమాలు సౌత్‌వే ఉన్నాయి. దీనిని బట్టి సౌత్ డామినేషన్ ఎలా ఉందో తెలుస్తోంది. ఇక 6 నుంచి 10 వరకు ఉన్న సినిమాలు కూడా సౌత్ సినిమాలే ఉన్నాయి. అంటే ఓవరాల్‌గా ఒక్క కశ్మీర్ ఫైల్స్ సినిమా వదిలేస్తే మిగిలిన అన్ని సౌత్ సినిమాలే… ఇండియన్ సినిమాను సౌత్ సినిమాలు ఎలా డామినేట్ చేస్తున్నాయో క్లీయర్‌గా తెలుస్తోంది. ఒక్క సారి టాప్ – 10 సినిమాల లిస్ట్ ఇలా ఉంది…
1. ఆర్ఆర్ఆర్, 2. ది కశ్మీర్ ఫైల్స్, 3. కేజీఎఫ్ ఛాప్టర్-2, 4. విక్రమ్, 5. కాంతార, 6. రాకెట్రీ, 7. మేజర్, 8. సీతారామం, 9. పొన్నియన్ సెల్వన్-1, 10. 777 చార్లీ