Moviesసురేష్‌బాబు, అర‌వింద్ థియేట‌ర్లూ బాల‌య్య‌కే... వార‌సుడికి దిల్ రాజు... చిరు సినిమా...

సురేష్‌బాబు, అర‌వింద్ థియేట‌ర్లూ బాల‌య్య‌కే… వార‌సుడికి దిల్ రాజు… చిరు సినిమా వెన‌క ఎవ‌రు ?

సంక్రాంతికి మొత్తం ఐదారు సినిమాలు థియేట‌ర్ల‌లోకి దిగుతున్నాయి. యూవీ వాళ్ల‌ది సంతోష్ శోభ‌న్ సినిమా, అజిత్ డ‌బ్బింగ్ మూవీ తెగింపు ప‌క్క‌న పెడితే మూడు సినిమాల మ‌ధ్య ప్ర‌ధానంగా పోటీ ఉండ‌గా.. థియేట‌ర్ల కోసం ఈ మూడు సినిమాలే కొట్టుకుంటున్నాయి. చిరంజీవి వాల్తేరు వీర‌య్య‌, బాల‌య్య వీర‌సింహారెడ్డి సినిమాల‌తో పాటు కోలీవుడ్ హీరో విజ‌య్ వార‌సుడు రిలీజ్ అవుతున్నాయి.

 

బాల‌య్య వీర‌సింహారెడ్డి జ‌న‌వ‌రి 12న వ‌స్తోంది. ఈ రిలీజ్ డేట్ ఖ‌రారైంది. ఇక అదే రోజు దిల్ రాజు వార‌సుడు లైన్లో ఉంది. వార‌సుడు, బాల‌య్య వీర‌సింహారెడ్డి ఒకే రోజు థియేట‌ర్ల‌లోకి దిగుతుండ‌డంతో వార్ మామూలుగా ఉండేలా లేదు. అయితే ఈ మూడు సినిమాల కోసం థియేట‌ర్ల యుద్ధాలు జ‌రుగుతున్నాయి. ఎగ్జిబిట‌ర్ల‌పై కూడా ఇప్ప‌టికే పెద్ద ఒత్తిళ్లు కూడా మొద‌లైపోయాయ‌ట‌.

దిల్ రాజు త‌న‌కు ప‌ట్టున్న ఏరియాల‌తో పాటు త‌న ఎగ్జిబిట‌ర్లు, డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు స‌హ‌జంగానే వార‌సుడు సినిమా వేయాల‌ని ఆదేశాలు జారీ చేసేశారంటున్నారు. ఏపీ, సీడెడ్‌, నైజాంలో మంచి థియేట‌ర్లు మాత్ర‌మే కాదు.. వీర‌సింహారెడ్డి, వీర‌య్య సినిమాల కంటే ఎక్కువ థియేట‌ర్ల‌లో వార‌సుడు రిలీజ్ అవుతోంది. ఇక తెలుగు స్టార్ హీరోల స్ట్రైట్ సినిమాలు వీర‌య్య‌, వీర‌సింహా మ‌ధ్య కూడా థియేట‌ర్ల విష‌యంలో చాలా గ‌ట్టి పోటీ ఉంది.

12న వీర‌సింహాకు ఎక్కువ థియేట‌ర్లు ప‌డ‌తాయి. అయితే 13న ఓవ‌రాల్‌గా బాల‌య్య సినిమా కంటే వీర‌య్య‌కే ఎక్కువ థియేట‌ర్లు ఇచ్చేలా ప్లానింగ్ జ‌రుగుతోంది. అయితే ఇక్క‌డే ట్విస్ట్ కూడా ఉంద‌ని తెలుస్తోంది. రీసెంట్‌గా ఆహా షోకు వ‌చ్చిన అల్లు అర‌వింద్‌, సురేష్‌బాబును బాల‌య్య డైరెక్టుగానే సంక్రాంతికి నా సినిమాకు ఎన్ని థియేట‌ర్లు ఇస్తున్నార‌న్న ప్ర‌శ్న వేసేశాడు.

అయితే ఇక్క‌డే ట్విస్ట్ ఉంది. ముందు చిరంజీవి సినిమాకే అల్లు అర‌వింద్ కూడా ఎక్కువ థియేట‌ర్లు ఇస్తాడంటున్నారు. అయితే ఆ సినిమా కంటే బాల‌య్య సినిమాకే ఏ మాత్రం కాస్త టాక్ పైన ఉన్నా వెంట‌నే
చిరంజీవి సినిమాకు థియేటర్లు త‌గ్గించేసి… బాల‌య్య సినిమాకు పెంచేలా తెర‌వెన‌క త‌తంగం న‌డుస్తోంద‌ట‌. అదే జ‌రిగితే చిరు సినిమాకు పెద్ద బొక్క‌డిపోయిన‌ట్టే..!

ఇప్పుడు చిరు సినిమాకు బాల‌య్య‌, విజ‌య్ సినిమాల కంటే మంచి టాక్ వస్తేనే సంక్రాంతికి అన్ని విధాలా పైచేయి సాధించిన‌ట్ల‌వుతుంది. ఈ రెండు సినిమాల‌తో పోలిస్తే ఏ మాత్రం వీక్ టాక్ వ‌చ్చినా చిరు సినిమాను థియేట‌ర్ల‌లో నుంచి బ‌ల‌వంతంగా తోసేసే ప‌రిస్థితే ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news