టాలీవుడ్ లో సీనియర్ హీరోలు బాలకృష్ణ – చిరంజీవి బాక్సాఫీస్ వారిలో సై అంటే సయ్యంటూ రంకెలేస్తే ఆ పోరు మామూలుగా ఉండదు. సంక్రాంతికి బాలయ్య – చిరంజీవి తమ సినిమాలతో పోటీపడుతున్నారు అంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. మూడున్నర దశాబ్దాల సినిమా కెరియర్ లో ఎన్నోసార్లు వీరిద్దరూ తమ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర పోటీపడి బాక్సాఫీసును హీటెక్కించారు. ఇక సంక్రాంతికి ఇద్దరు హీరోల సినిమాలు వస్తున్నాయంటే ఇద్దరు హీరోల అభిమానుల మధ్య పెద్ద యుద్ధమే జరిగేది.
టాలీవుడ్ లో సీనియర్ హీరోల్లో వీరిద్దరికి అదిరిపోయే ఫ్యాన్ బేస్ ఉంది. అదిరిపోయే మార్కెట్ కూడా ఉంది.. అందుకు తగ్గట్టే వీళ్ళిద్దరి సినిమాలకు ఓపెనింగ్స్ కూడా వస్తాయి. ఇక్కడ వరకు బాగానే ఉంది.. అయితే వచ్చే సంక్రాంతికి బాలయ్య వీర సింహారెడ్డి – చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలతో పోటీ పడుతున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు బాలయ్య డేరింగ్ గా ముందుకు వెళుతుంటే చిరంజీవి కాస్త డిఫెన్స్ తో పోటీకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది.
చిరంజీవి పదేళ్ల గ్యాప్ తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో వెండితెరపై రీఎంట్రీ ఇచ్చారు. అప్పటినుంచి చిరు ఎక్కువగా రీమిక్స్ సినిమాలు చేస్తున్నారు. ఖైదీ 150 సినిమాతో పాటు గాడ్ ఫాదర్ – భోళాశంకర్ సినిమాలు రీమేక్‌లే. అయితే బాలయ్య మాత్రం ఇందుకు భిన్నంగా అఖండ లాంటి ఎవరు చేయలేని పాత్రను ఎంచుకుని సాహసం చేసి ప్రేక్షకుల ఆదరభిమానాలు సొంతం చేసుకున్నారు. ఓవైపు చిరంజీవి ఇతర భాషల్లో హిట్ అయిన రీమిక్స్ సినిమాలు చేయడంతో… ప్రేక్షకుల్లో ఏమాత్రం ఆసక్తి కలిగించని డైరెక్టర్లతో సినిమాలు చేయటం కూడా ఫ్యాన్స్ కు నచ్చటం లేదు.
ఇదిలా ఉంటే బాలయ్య తన సినిమాల్లో తానే స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాడు. చిరంజీవికి ఆచార్య సినిమాలో రామ్ చరణ్ ఉన్నాడు. గాడ్ ఫాదర్ సినిమాలోని సత్యదేవ్‌తో పాటు నయనతార లాంటి క్రేజీ హీరోయిన్ ఉంది. పైగా గాడ్ ఫాదర్ లో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తో స్పెషల్ రోల్ వేయించారు. సంక్రాంతికి వస్తున్న వీరయ్య సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ కీలకపాత్రలో కనిపిస్తున్నాడు. ఈ పాత్ర సినిమాకు ఆయువుపట్టుగా ఉంటుందని తెలుస్తోంది. రేపు వీర సింహారెడ్డి సినిమాపై వీరయ్య పై చేయి సాధించినా అందులో రవితేజ పాత్రను తక్కువ చేసి చూపించలేం.
బాలయ్యను ఎదుర్కొనేందుకు రవితేజ సాయం తీసుకుని మరి చిరంజీవి బాక్సాఫీస్ బరిలోకి దిగాడన్న విమర్శలు వస్తాయి. అదే బాలయ్య పై చేయి సాధిస్తే చిరంజీవి రవితేజను తోడు తెచ్చుకున్నా బాలయ్యే గెలిచాడు అన్న చర్చలు నడుస్తాయి. ఏదేమైనా ఈ వయసులో బాలయ్య అదిరిపోయే కథలు ఎంచుకొంటూ డేరింగ్ స్టెప్పులతో దూసుకుపోతుంటే.. చిరంజీవి మూసకథలు.. ముతక డైరెక్టర్లతో ప్యాడింగ్ హీరోలతో సినిమాలు చేస్తుండటం ఎవరికి నచ్చటం లేదు.