రోజులు గడుస్తున్నాయి.. నెలలు గడుస్తున్నాయి… చిరు ఒక్కో సినిమా రిలీజ్ అయిపోతోంది. అయితే భోళాశంకర్ అసలు రిలీజ్ అవుతుందా ? అన్న సందేహం ఇప్పుడు చిరుకే వచ్చేసిందట. ఇది ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోన్న గాసిప్. చిరు చేసిన సినిమాలలో ఈ యేడాది ఇప్పటికే ఆచార్య, గాడ్ ఫాదర్ వచ్చేశాయి. మరో నెల రోజుల్లో సంక్రాంతికి వాల్తేరు వీరయ్య వస్తోంది. ఇక వీరయ్య కంటే ముందు వస్తుందనుకున్న గాడ్ ఫాదర్ పరిస్థితి మాత్రం అర్థం కావట్లేదు.
అసలు భోళా శంకర్ రీమేక్ అనేది పెద్ద కుక్క రాడ్ సినిమా అని మెగా ఫ్యాన్సే తలలు పట్టుకుంటున్నారు. చిరు ఎంత బాగా చేసినా కథలో ఎంత దమ్ము ఉన్నా.. చివరకు హిట్ టాక్ వచ్చినా కూడా గాడ్ ఫాదర్ సినిమానే ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇక కోలీవుడ్‌లో అజిత్ హీరోగా వచ్చిన వేదాళం పరమ రొటీన్ మాస్ మసాలా సినిమా. ఇందులో అంత గొప్ప కథ లేదు. సిస్టర్ సెంటిమెంట్ కూడా మరీ గొప్పగా ఉండదు.
ఇక రీ ఎంట్రీలో వరుసగా రీమేక్ సినిమాలు చేస్తూ తన ఫ్యాన్స్‌కు మేకులు దింపేస్తున్న చిరు వేదాళం రీమేక్‌కు ఎందుకు ? ఒప్పుకున్నారో ? ఎవ్వరికి అర్థం కాలేదు. పైగా అది కూడా మెహర్ రమేష్ దర్శకత్వంలో కావడం ఫ్యాన్స్‌ను మరో షాక్‌కు గురి చేసింది. అసలు మెహర్ రమేష్ సినిమాల లిస్ట్ చూస్తే రాత్రిళ్లు భయంకరమైన కలలు వస్తాయి.
మెహర్ రమేష్ చేసిన షాడో, శక్తి సినిమాల దెబ్బకు ఆయా హీరోల కెరీర్‌లు ఎంత పాతాళంలోకి వెళ్లిపోయాయో చెప్పక్కర్లేదు. చివరకు అశ్వనీదత్ లాంటి ప్రొడ్యుసర్ శక్తి దెబ్బకు కోలుకునేందుకు దాదాపు 10 ఏళ్లు పట్టింది. మరి అంత గొప్ప చరిత్ర ఉన్న డైరెక్టర్‌కు చిరు ఎందుకు ? ఓకే చెప్పాడో ఆయన వీరాభిమానులకే అర్థం కాలేదు.
అసలు ఈ రీమేక్ ముందుగా పవన్ దగ్గరకు వెళ్లింది. పవన్ నో చెప్పగా చిరు ఓకే చేశాడు. సిస్టర్ పాత్రకు ముందుగా సాయి పల్లవిని అనుకున్నారు. ఫేడవుట్ అయిన కీర్తి సురేష్‌ను పెట్టారు. ఇక హీరోయిన్‌గా కూడా తమన్నా ఫేడవుట్ అయిపోయింది. ఆమె ఆల్రెడీ చిరు పక్కన సైరాలో చేసింది. ఇప్పుడు అందరూ మర్చిపోతోన్న వేళ మళ్లీ అదే తమన్నాను పెట్టారు.
మరో ట్విస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మెహర్ రమేష్ తీసిన అవుట్ ఫుట్ కూడా చిరును ఏ మాత్రం శాటిస్‌పై చేయలేదట. అసలు చిరంజీవి ఈ ప్రాజెక్టును అటకెక్కించినా ఆశ్చర్యపోనక్కర్లేదనే వరకు పరిస్థితి వచ్చేసింది. ఏదేమైనా భోళా శంకర్ రిలీజ్ అయ్యే వరకు ఏం జరుగుతుందో ? చెప్పలేని పరిస్థితి.