ఒకప్పుడు సినిమాలు రాకముందు వీధి నాటకాలు, స్టేజి షోల ద్వారా కళాకారులు ప్రేక్షకులను అలరించారు. ఇక భారత దేశంలో వివిధ కళా సంస్కృతులు మేళవించిన రంగస్థలంపై నటించి మెప్పించేవారు. రాను రాను ఆ కళలు అంతరించి పోసాగాయి.. గ్రామాల్లో సైతం రంగస్థలంపై నాటకాలు వేసేవారు కనుమరుగవుతున్నారనే చెప్పొచ్చు. తాజాగా మెగాస్టార్ వారసుడు రాంచరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ రంగస్థలం 1985 శ్రీకారం చుట్టారు.
రామ్ చరణ్ – సుక్కూ కాంబోలో తెరకెక్కుతున్న రంగ స్థలం సినిమా రాక ఆలస్యమవుతోంది. 2.ఓ విడుదల వాయిదా కారణంగా పలు సినిమాలు ఇబ్బంది పడుతున్నాయి.వాస్తవానికి ఏప్రిల్లో ‘రంగస్థలం’.. ‘భరత్ అను నేను’.. ‘నా పేరు సూర్య’ చిత్రాలు విడుదల కావాల్సి ఉంది. వీటి విడు దలకు ఇప్పుడు ఇబ్బంది తప్పదు. ముఖ్యంగా ‘రంగ స్థలం’ టీంకు ఇది బాగా ఇబ్బంది కలిగించే విషయమే. దీంతో పవన్ సినిమా విడుదలైన రెండు మూడు రోజులకు రిలీజ్ చేస్తే ఇబ్బందేమీ ఉండదని ఆలోచిస్తున్నారట. కాకపోతే వేసవి విడుదల అని ఫిక్సయిపోయి కొన్ని రోజులుగా తాపీగా పని చేస్తోంది సుక్కు అండ్ టీం. సంక్రాంతికే వద్దామనుకుంటే మాత్రం కొత్త కష్టాలు భరించక తప్పదు. ‘నాన్నకు ప్రేమతో’కు శ్రమించినట్లు రేయిం బవళ్లు చెమడోడ్చాల్సి రావచ్చు.
అడుగడుగునా ఇబ్బందుల్లో రంగస్థలం… అసలు ఎం జరిగింది?
మరిన్ని వార్తల కోసం తెలుగు లైవ్స్ వాట్సాప్ లో ఫాలో అవ్వండి