ఒక్కటి మాత్రం నిజం. నమత్రను పెళ్లి చేసుకున్నాక మహేష్ ఆర్థిక ఆలోచనలు, వ్యవహారాల్లో మార్పు వచ్చిందన్నది. టాలీవుడ్‌లో ఈ టాక్ బలంగా వినిపిస్తూ ఉంటుంది. అందులో తప్పులేదు. అయితే మహేష్ సినిమాల వ్యవహారాలు, రెమ్యునరేషన్లు , బిజినెస్‌ల్లోనూ ఆమె పాత్ర ఎక్కువుగా ఉంటుందన్న టాక్ శ్రీమంతుడు సినిమా నుంచి బాగా వినిపిస్తోంది. నిర్మాతలు మహేష్‌తో సినిమా చేసేందుకు నమ్రతను కలిస్తే బాబు రు. 55 అడుగుతున్నాడు.. రు. 60 కోట్లు అడుగుతున్నాడని ముందే ఆమె చెపుతుందట.
నిర్మాతలు ఎవరైనా అంత ఇచ్చుకోలేం అని చెపితే… బాబు బిజీగా ఉన్నాడు… కమిట్‌మెంట్ అయిన సినిమాలు రెండు, మూడు ఉన్నాయి.. తర్వాత చూద్దాం అని చెపుతుందన్న గుసగుసలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే మహేష్ సంపాదించిన సొమ్ముతో రకరకాల వ్యాపారాల్లోనూ నమ్రతనే పెట్టుబడులు పెట్టిస్తోంది. ఇప్పటికే రియల్ ఎస్టేట్‌లోకి దిగారు. ఇటు హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏసియన్ వాళ్లతో కలిసి నగరానికే తలమానికం అయిన ఏఎంబీ మాల్ ఏర్పాటు చేశారు.
ఇక ఇప్పుడు మినర్వా పేరుతో మరో రెస్టారెంట్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇలా నమ్రత తెలివిగా పెట్టుబడులు పెట్టుకోవడం వరకు ఓకే… అయితే ఆమె మహేష్ రెమ్యునరేషన్లు కూడా డిసైడ్ చేయడంతో ఆమెకు ఇంత డబ్బు వ్యామోహమా ? అన్న చర్చలు ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్‌లో అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి. మహేష్ ప్రతి నిర్ణయాన్ని ఆమే ప్రభావితం చేస్తుందని అంటారు.
ఇంకా చెప్పాలంటే మహేష్ కూడా ఆమె అడుగుల్లోనే అన్నీ అడుగులు వేస్తూ ముందుకు వెళుతుంటాడట. చివరకు ఆమె చెప్పడం వల్లే యాడ్స్ కూడా చేస్తున్నాడని… మహేష్‌కు ఉన్న క్రేజ్‌ను ఆమె అన్ని విధాలా క్యాష్ చేసుకోవడంలో సిద్ధ హస్తురాలని ఇండస్ట్రీ వాళ్లు చెవులు కొరుక్కుంటూ ఉంటుంటారు. మామూలుగా మహేష్‌కు యాడ్స్ చేసేందుకు పెద్దగా ఆసక్తి ఉండదట.
అయితే నమ్రత జోక్యంతో భారీ రెమ్యునరేషన్ రావడంతోనే మహేష్ యాడ్స్‌కు కూడా ఓకే చెప్పాడంటారు. ఏదేమైనా మహేష్ ఆర్థిక వ్యవహారాలను చూసుకోవడం వరకు తప్పులేదు కాని.. ఆమె అన్నీ నిర్ణయిస్తుండడంతో ఆమెకు డబ్బుపై వ్యామోహం ఎక్కువన్న చర్చలు అయితే ఇండస్ట్రీలో ఎక్కువుగా ఉంటాయి.