నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్లో ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. బాలయ్య అటు వెండితెరతో పాటు ఇటు బుల్లి తెరను కూడా షేక్ చేసి పడేస్తున్నారు. అఖండ సినిమాతో బాలయ్యకు ఎక్కడాలేని అఖండకీ ఖ్యాతి వచ్చేసింది. వచ్చే సంక్రాంతికి రిలీజ్ అవుతున్న వీరసింహారెడ్డి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటు బుల్లితెరపై ఆహా ఓటీటీలో చేస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. రీసెంట్గా ప్రారంభమైన అన్‌స్టాపబుల్ సీజన్ 2 లో చంద్రబాబు – లోకేష్ ఎపిసోడ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
ఇక చివరిగా వచ్చిన కోదండరామిరెడ్డి – రాఘవేంద్రరావు – సురేష్ బాబు – అల్లు అరవింద్ ఎపిసోడ్ కూడా బాగా పేలింది. ఈ క్రమంలోనే బాలయ్య ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన యాడ్‌లో కూడా కనిపించారు. ఈ యాడ్ లో బాలయ్య చాలా స్టైలిష్ గా కనిపించగా యాడ్ అదిరిపోయింది. అయితే బాలయ్య తన కెరీర్ లో ఇప్పటివరకు వాణిజ్య సంస్థలకు చెందిన ప్రకటనల్లో కనిపించేందుకు ఇష్టపడలేదు. ప్రభాస్ గతంలో మహీంద్రా కంపెనీకి చెందిన వెహికల్ యాడ్ లో కనిపించాడు ముందుగా ఈ యాడ్‌లో చేసే అవకాశం బాలకృష్ణకే దక్కింది.
బాలయ్య ఈ యాడ్ చేసేందుకు ఒప్పుకోలేదు. దీనికి కారణం కూడా ఉంది. బాలయ్య సినిమాల్లో పెద్దపెద్ద వెహికల్స్, టాటా సుమోలు గాల్లోకి లెగుస్తుంటాయి. బాలయ్య బలమైన యాక్షన్ సన్నివేశాల్లో విలన్లను కొడుతుంటే వాళ్లు వెళ్లి ఆ వెహికల్స్ మీద పడి తనాతనకులు అయిపోతూ ఉండటం… కారు డోర్లు ఊడిపోతూ ఉండటం… బాలయ్య సింగిల్ హ్యాండ్‌తో మహేంద్రా జీపును ఎత్తేయడం… ఆయన సినిమాలలో కోకోల్లలుగా కనిపిస్తాయి.
బాలయ్య ఈ యాడ్ చేస్తే సెటైర్లు, విమర్శలు వస్తాయన్న కారణంతో పాటు ఆయనకు వాణిజ్య ప్రకటనల్లో చేయడం ఇష్టం లేక ఇది వదులుకున్నారు. ఆ తర్వాత ఈ యాడ్ వెంకటేష్ దగ్గరకు వెళ్లి చివరకు ప్రభాస్ ఈ యాడ్ చేశాడు. మహేంద్ర కంపెనీకి చెందిన రెడ్ కలర్ వెహికల్లో యెడారిలో దూసుకుపోవడం.. వెంటనే దమ్ము రేగడం చూశాం. అయితే ఈ యాడ్ సరిగా క్లిక్ కాలేదు. ఇక ఇప్పుడు బాలయ్య కెరీర్ పరంగా ఇప్పుడు స్వింగ్‌లో ఉండడంతో రియల్ ఎస్టేట్ యాడ్‌లో నటించగా సూపర్‌గా క్లిక్ అయ్యింది.