Moviesమహేశ్ సినిమాలో ఎవ్వరు ఊహించని హీరో.. త్రివిక్రమ్ ప్లాన్ కి హ్యాట్సాఫ్...

మహేశ్ సినిమాలో ఎవ్వరు ఊహించని హీరో.. త్రివిక్రమ్ ప్లాన్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో ప్రజెంట్ తన ఫోకస్ మొత్తం త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తో తెరకెక్కుతున్న సినిమాపై పెట్టాడు . ఇప్పటికే మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రెండో షెడ్యూల్ స్టార్ట్ కాబోతుంది. దీని కోసమే జిమ్లో వర్కౌట్ లు చేస్తున్నాడు మహేష్ బాబు . కాగా మూడు నెలల వ్యవధిలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న బాధ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న మహేష్ ..రీసెంట్గా జిమ్ లో వర్కౌట్ చేస్తున్న పిక్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు .

ఈ క్రమంలోనే ఆ పిక్ ను వైరల్ చేస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్ . ఈ సినిమాలో సెకండ్ టైం మహేష్ బాబుతో జతకడుతున్న పూజా హెగ్డే ఆరోగ్యం కూడా ఇప్పుడిప్పుడే కుదుటపడడంతో ఆమె కూడా సెకండ్ షెడ్యూల్లో భాగమయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ సినిమాల్లో మరో స్టార్ హీరో కూడా నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం టాలీవుడ్ ఐకాన్ హీరో అల్లు అర్జున్ కూడా మహేష్ బాబు -త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కాంబోలో రాబోతున్న సినిమాలో ఒక గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నారట .

ఇదే విషయాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు బన్నీ – మహేష్ ఫ్యాన్స్ . మనకు తెలిసిందే త్రివిక్రమ్ – బన్నీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ . వీళ్ళ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్టుగా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ స్పెషల్ ఫోర్స్ మీద మహేష్ సినిమాలో గెస్ట్ రోల్ కి అంగీకరించినట్లు ఒక్క న్యూస్ వైరల్ గా మారింది . ఏది ఏమైనా సరే ఒకే తెరపై మహేష్ బన్నీని చూస్తే అభిమానులకు పూనకాలు రావాల్సిందే.. డైరెక్టర్ ప్లాన్ కి హ్యాట్సాఫ్ అంటున్నారు మహేష్ – బన్నీ ఫాన్స్ . చూడాలి మరి దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news