సల్మాన్‌ఖాన్ మరదలు, అర్బాజ్ ఖాన్ మాజీ భార్య మలైకా అరోరా 50 ఏళ్ల వయస్సులో ఉంది. తన భర్తకు విడాకులు ఇచ్చేసిన మలైకా తనకంటే వయస్సులో 13 ఏళ్లు చిన్నోడు అయిన అర్జున్ కపూర్‌తో సహజీవనం చేస్తోన్న సంగతి తెలిసిందే. మలైకా కెరీర్ పరంగా చూస్తే అంత గొప్ప నటి కాదు. చెప్పుకోదగ్గ సినిమాలు కూడా లేవు. హీరోయిన్గా క్లిక్ కూడా కాలేదు. అయితే ఒకటి రెండు ఐటెం సాంగులతో మాత్రమే ఆమె బాగా పాపులర్ అయ్యింది. ఊహించని విధంగా బాలీవుడ్లో పెద్ద పేరున్న కుటుంబానికి కోడలు అయ్యింది.
సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్‌ఖాన్‌ను ప్రేమ వివాహం చేసుకున్న మలైకా అతడితో 18 ఏళ్ల పాటు కాపురం చేసి ఓ కొడుకును కన్నాక విడాకులు ఇచ్చేసింది. మలైకా ముందు నుంచి మితిమీరిన స్వేచ్ఛతో ఉండేది. పార్టీలకు కూడా చాలా హాట్ డ్రెస్సులతోనే బయటకు వచ్చేది. ఈ క్రమంలోనే అర్జున్ కపూర్‌తో పరిచయం ప్రేమగా మారి చివరకు వాళ్లిద్దరు సహజీవనం చేసే వరకు వచ్చేసింది.
ఇక గత నాలుగేళ్లుగా చాలా డీప్ లవ్‌లో ఉన్న ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఎప్పటికప్పుడు ప్రచారం జరుగుతున్నా వీరు పెళ్లి మాత్రం చేసుకోవడం లేదు. అయితే తాజాగా మలైకా యూ టర్న్ తీసుకుని తన భాజీ భర్తపై ప్రేమ కురిపించేస్తోంది. ఇది ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో హైలెట్‌గా మారింది. తన మాజీ భర్త అర్బాజ్ చాలా మంచి వాడని.. కేవలం తమ దారులు వేర్వేరు కావడంతోనే విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని చెపుతోంది.
ఆమె రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాజీ భర్తపై ఎక్కడా లేని ప్రేమ కురిపించేసింది. ఇక అర్బాజ్‌కు ముందు ప్రపోజ్ చేసింది కూడా తానే అని.. ఈ విషయం తాను ఇప్పటి వరకు ఎవ్వరికి చెప్పలేదని.. తాను ముందు వెళ్లి మిమ్మలను పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పగా.. అతడు ఓకే చెప్పాడని.. అయితే మేం జీవితంలో భిన్న దారుల్లో ప్రయాణించాల్సి రావడంతోనే విడిపోయామని.. కానీ అతడు ఎంతో మంచి వ్యక్తి… నన్ను ఎంతో మార్చాడు… ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే కారణం అర్బాజ్ అని ఆకాశానికి ఎత్తేసింది.
ఇప్పటకీ అర్బాజ్ కు నా మీద ప్రేమ తగ్గలేదు… ఇటీవల నాకు ప్రమాదం జరిగి ఆపరేషన్ చేయించుకున్నాను.. నేను ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన వెంటనే నా కోసం బయట వెయిటింగ్ చేస్తున్నాడంటూ మెచ్చుకుంది. మలైకా కామెంట్స్ చూసిన బాలీవుడ్ జనాలు మలైకాకు అసలు జీవిత సత్యం అర్థమైనట్టు ఉందని.. ఆమె తిరిగి అర్బాజ్‌కు దగ్గరై అర్జున్‌కు షాక్ ఇస్తుందని కూడా అంటున్నారు.