ఎన్నో అంచనాల మధ్య 2023 సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్లు వచ్చేసాయి. 11 అజిత్ తునివు ( తెలుగులో తెగింపు అంటున్నారు), విజయ్ వారసుడు 12న, బాలయ్య వీరసింహారెడ్డి కూడా 12న వస్తున్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాను జనవరి 13న లాక్ చేశారు. అయితే చిరంజీవి సినిమా డేట్ 13న లాక్ చేయడంపై మెగాభిమానులు గుర్రుగానే ఉన్నారు. ఎందుకంటే వీరయ్య తొలి రోజు రికార్డులు సెట్ చేయడం అన్నది అసాధ్యం.
అసలు వీరయ్యకు చిరు స్టామినాకు తగ్గ రేంజ్ లో థియేటర్లు దొరికే పరిస్థితి కూడా లేదు. అదే ఆచార్య, గాడ్ ఫాదర్‌లా సోలోగా వచ్చి మంచి హిట్ టాక్ వచ్చి ఉంటే ఆ సినిమా రేంజ్ వేరుగా ఉండేది. ఇక అజిత్ తెగింపు సినిమా 11న తెలుగు, తమిళ్‌లో వేస్తున్నారు. ఈ సినిమాను కూడా దిల్ రాజు రిలీజ్ చేసే ఛాన్సులే ఉన్నాయంటున్నారు. ఎంతలేదన్నా ఏ సెంటర్లలో కొన్ని స్క్రీన్లతో పాటు మల్టీఫ్లెక్ష్‌ల్లో కొన్ని షోలు ఆ సినిమాకు ఇవ్వాలి. పైగా 11న తెగింపుకు సోలో రిలీజ్‌తో ఎక్కువ థియేటర్లు దొరుకుతాయి.
12న వారసుడు, బాలయ్య వీరసింహారెడ్డి ఉన్నాయి. రెండు సినిమాలు థియేటర్లను చెరి సగం పంచుకుంటాయి. వారసుడు దిల్ రాజు సొంత బ్యానర్ కావడంతో మంచి థియేటర్లు అన్నీ ఆ సినిమా కోసం బాగా బ్లాక్ చేసేశారు. ఇక కొన్ని థియేటర్లు వీరసింహారెడ్డికి ఉంటాయి. అదే 13కు వస్తే అజిత్, విజయ్ వారసుడు, బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలకు పోగా ఉన్న మిగిలిన థియేటర్లే వీరయ్యకు ఇస్తారు.
అంటే ఎలా లేదన్నా తొలి రోజు వీరయ్యకు 30 – 35 శాతం థియేటర్లు మించి దొరికే పరిస్థితి లేదు. అంటే మూడు సినిమాల తర్వాత నాలుగో సినిమాగా వీరయ్య వస్తోంది. మూడు పెద్ద సినిమాలతో కలిసి స్క్రీన్లు షేర్ చేసుకోవాల్సి ఉంది. మరో ట్విస్ట్ ఏంటంటే సంతోష్ శోభన్ సినిమా యూవీ క్రియేషన్స్ వాల్లది కూడా సంక్రాంతికే వస్తోంది. యూవీ వాళ్ల థియేటర్లు అటు వెళ్లిపోతున్నాయి.
ఎటు చూసినా అన్ని సినిమాలు పంచుకున్నాక మిగిలిన థియేటర్లు.. అది కూడా తక్కువ థియేటర్లలోనే వీరయ్య సినిమా వస్తోంది. దీంతో ఈ సినిమాకు రికార్డుల సంగతి అటు ఉంచితే కనీసం ఓపెనింగ్స్ కూడా అనుకున్నట్టుగా వచ్చే పరిస్తితి లేదు. అందుకే సంక్రాంతి పోరులో బాలయ్య వీరసింహారెడ్డితో ప్రధానంగా పోటీ పడుతోన్న చిరు వీరయ్య రికార్డులకు ముందే చెక్ పడినట్లయ్యింది.