సీతారామకళ్యాణం. ఇది ఓల్డ్ మూవీ. శ్రీరామ చంద్రుని వివాహ ఘట్టంతో ఇది పూర్తి అవుతుంది. దీనిలో అన్నగారు రావణాసురుడి పాత్రను ఘనంగా పోషించారు. నిజానికి చెప్పాలంటే.. ఈ సినిమాలో రాముడి పాత్రకన్నా రావణాసురుడి పాత్రను ఎక్కువగా ఎలివేట్ చేసి చూపించారు. కథ ఉద్దేశం కూడా అదే అనిపిస్తుంది. నిజానికి ఈ సినిమాలోనే సూపర్ స్టార్ కృష్ణను శతృఘ్నుడి పాత్రకు తీసుకుందామని అనుకున్నారట. అయితే, మేకప్ వేసిన తర్వాత ఎందుకో ఆయనను తప్పించారు.
ఇదిలావుంటే, రాముడిగా హరినాథ్, సీతగా కొత్త ఆర్టిస్టు గీతాంజలిని ఎన్టీఆర్ పరిచయం చేశారు. మరోవైపు.. ఈ సినిమాకు అన్నగారే దర్శకత్వం వహించారు. ఇక, ఈ సినిమా అద్భుతంగా తీయడంలో అందరూ సాయ పడ్డారు. పూర్తిగా అన్నీ అన్నగారే దగ్గరుండి చూసుకున్నారు. 1961లో వచ్చిన ఈ మూవీ అప్పట్లోనే భారీ కలెక్షన్లు రాబట్టింది. అయితే.. ఇక్కడ చిత్రం ఏంటంటే.. ఈ సినిమా విషయంలో నటించిన వారికి ఎలాంటి హోప్స్ లేవు.
ఎందుకంటే.. అందరికీ తెలిసిన కథే. పైగా అన్నగారు రావణాసురుడి వేషం.. అంటే యాంటీ పాత్ర వేశారనే అభిప్రాయం ఉంది. కానీ, రావణాసురుడిగా.. అన్నగారు తనపై తనకు నమ్మకం పెట్టుకున్నారు. ఈ బెరుకుల మధ్యే సినిమాను విడుదల చేశారు. ఇక, విడుదలకు ముందు రోజు.. ఎన్టీఆర్.. అప్పటి తమిళనాడు గవర్నర్ సహా.. ఏపీలోని కీలకమైన నటులు, నిర్మాతలు.. ఇక, ఈ సినిమాల నటించిన వారికి ప్రత్యేకంగా సీతారామ కళ్యాణం సినిమా చూపించాలని నిర్ణయించారు.
అయితే, ఇదేదో లైట్‌గా చేయలేదు. జెమినీ స్టూడియోలో అచ్చు.. సీతారామ కళ్యాణం వేదికను తలపించేలా.. భారీ సెట్టింగు వేయించి.. వచ్చిన అతిథులకు భారీ పిండి వంటలతో విందు కూడా ఏర్పాటు చేశారు. ఇక, మూడు గంటల సినిమాను తిలకించిన ముఖ్యమైన వారంతా.. ఎక్కడా అసంతృప్తి చెందకపోగా.. విజయం ఖాయమని దీవించారట.
ఇదంతా చూసిన కత్తుల కాంతారావు.. ఇంత ఖర్చు ఎందుకు పెట్టారని.. అంటే.. మీ కోసమే.. మీ భయం పోవడం కోసమే అని చెప్పారు ఎన్టీఆర్. మొత్తానికి ఈ సినిమా అనేక అవార్డులు అందుకుని.. కాసుల వర్షం కురిపించింది. ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాను ముందుగా కెవి. రెడ్డి డైరెక్ట్ చేయాలి. అయితే ఎన్టీఆర్ తానే రావణాసురుడు వేషం వేస్తానని అనడంతో ఆయనకు ఇష్టంలేక తప్పుకున్నారు. దీంతో ఎన్టీఆర్ తానే డైరెక్షన్ చేసుకున్నారు.