ఈ టైటిల్ కాస్త ఇబ్బందిగాను, షాకింగ్‌ను ఉండొచ్చు.. కానీ అల్లరి నరేష్ తాజా సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా కలెక్షన్లు చూస్తే నిజంగానే ఈ నిర్ణయం తీసుకుంటాడా అనేలా ఉంది. గత కొద్ది రోజులుగా నరేష్ సినిమాలను జనాలు పట్టించుకోవడం లేదు. అసలు ఒకప్పుడు నరేష్ సినిమా వస్తుందంటే మనోడికి సపరేట్గా ఉన్న ఫ్యాన్స్ థియేటర్లకు క్యూ కట్టేవారు. ఒక్క యేడాదిలో 7-8 సినిమాలు చేసి ప్రేక్షకులను నవ్వించేవాడు అల్లరోడు.
ఎప్పుడో వచ్చిన సుడిగాడు సినిమా తర్వాత నరేష్‌కు ఆ రేంజ్‌కు తగ్గ హిట్ పడలేదు. వరుస ప్లాపుల తర్వాత చేసిన నాంది సినిమాకు మంచి ప్రశంసలే వచ్చినా… ఆ రేంజ్లో వసూళ్లు రాలేదు. ఇక మారేడుమిల్లి సినిమాకు డీసెంట్ టాక్ వచ్చింది. అయితే కలెక్షన్లు మాత్రం సుడిగాలి సుధీర్ రేంజ్ కన్నా దీనంగా ఉన్నాయి. ఫస్ట్ వీకెండ్లో ఈ సినిమా కేవలం 1.28 కోట్ల షేర్ తెలుగు రాష్ట్రాల్లో రాబట్టింది. గ్రాస్ లెక్కలు చూసుకున్నా రు 2.5 కోట్లకు దగ్గర్లోనే ఆగింది.’
ఈ సినిమాతో అల్లరి నరేష్ కెరీర్లోనే హయ్యస్ట్ రెమ్యునరేషన్ అందుకున్నాడు. సినిమాకు ఉన్నంతలో ఓ మోస్తరు టాక్ వచ్చినా పబ్లిసిటీ ఏ మాత్రం పట్టించుకోలేదు. అందుకే జనాలు నరేష్ సినిమాను పట్టించుకోలేదు. ఓ వైపు డబ్బింగ్ సినిమా లవ్‌టుడే దూసుకుపోతోంది. కేవలం మూడు రోజులకే రు. 8 కోట్ల నెట్ వసూళ్లతో మారేడుమిల్లి సినిమాను పాతాళానికి తొక్కి పడేసింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం నరేష్ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో రు 2.50 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టాల్సి ఉంది.
ఏదేమైనా నరేష్ సినిమాకు ఫస్ట్ వీకెండ్‌కే ప్రజలు సెలవు చెప్పేశారు. నరేష్ కథల విషయంలో జాగ్రత్తలు తీసుకోకుండా ఇలాగే వెళితే మనోడు హీరోగా సినిమాలు మానేసి… మహర్షి సినిమాలో వేసుకున్న సైడ్ క్యారెక్టర్లే వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే నరేష్ ఆ క్యారెక్టర్లకు అతి దగ్గరగా ఉన్నాడు. మరొ ఒకటి రెండు ప్లాప్స్ పడితే అదే పరిస్థితి.