టాలీవుడ్లో అతిలోక సుందరి శ్రీదేవి అందం గురించి, నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తమిళంలో కెరీర్ ప్రారంభించిన శ్రీదేవి తెలుగు సినిమా ఇండస్ట్రీని 20 ఏళ్ల పాటు ఏలేసింది. శ్రీదేవికి అంత క్రేజ్ రావడానికి కారణం తెలుగు సినిమా ఇండస్ట్రీయే. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి వెళ్లాక శ్రీదేవి నేషనల్ హీరోయిన్ అయిపోయింది. శ్రీదేవి ఇద్దరి కూతుర్లలో జాన్వీకపూర్ ఇప్పటికే బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చేసింది. ఆమె తెలుగులోనూ స్టార్ హీరోల సినిమాల్లో నటించే ట్రైల్స్‌లో ఉంది.
ఇక శ్రీదేవి చెల్లి కూడా తెలుగులో హీరోయిన్గా నటించింది. ఆమె కూడా అందరికి తెలిసిన హీరోయినే. ఆమె ఎవరో కాదు మహేశ్వరి. మహేశ్వరి శ్రీదేవికి కజిన్ అవుతుంది. కాస్తంత అందంతో పాటు అభినయం ఉన్నా అక్కలా స్టార్ హీరోయిన్ కాలేకపోయింది మహేశ్వరి. తెలుగులో అమ్మాయి కాపురంతో కెరీర్ ప్రారంభించినా గులాబి సినిమా ఆమెకు మంచి పేరు తీసుకువచ్చింది.
ఆ తర్వాత ఖైదీ ఇన్స్పెక్టర్, దెయ్యం, మృగం, జాబిలమ్మ పెళ్లి, నీకోసం, తిరుమల తిరుపతి వెంకటేశ, నవ్వులాట, మా బాలాజీ, ప్రేమించేది ఎందుకమ్మా, రామసక్కనోడు, వెలుగునీడలు, బలరాం, మా అన్నయ్య సినిమాల్లో నటించారు. తెలుగు,తమిళ, కన్నడ సినిమాల్లో ఎందరో హీరోలతో నటించిన మహేశ్వరి మెప్పించింది. ఆ తర్వాత జయకృష్ణన్తో ఆమెకు వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కొద్ది రోజుల పాటు సినిమాలకు దూరమైనా తర్వాత సీరియల్స్‌తో రీ ఎంట్రీ ఇచ్చింది.
జీ తెలుగులో వచ్చిన మైనేమ్ ఈజ్ మంగతాయారు సీరియల్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే మహేశ్వరి అప్పట్లో ఓ హీరోతో ఎఫైర్ నడిపిందన్న పుకార్లు షికార్లు చేశాయి. ఆ హీరో ఎవరో కాదు నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి… అలియాస్ జేడీ చక్రవర్తి. గులాబి – దెయ్యం – మృగం ఈ మూడు సినిమాలో వీరి కాంబినేషన్లో వెంటవెంటనే వచ్చచేశాయి. ఆ టైంలోనే వీరి మధ్య ఎఫైర్ నడిచిందన్న టాక్ వచ్చింది.
అసలు నిజం ఏంటన్నది ఎవ్వరికి తెలియకపోయినా వీరు చాలా అంటే చాలా క్లోజ్‌గా మూవ్ అయ్యేవారట. ఆ తర్వాత మహేశ్వరి 2000 వరకు టాలీవుడ్లో కెరీర్ కొనసాగింది.. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది.