టాలీవుడ్ టాప్ ప్రొడ్యుసర్ దిల్ రాజు ప్రస్తుతం అటు నిర్మాణ పరంగాను, ఇటు డిస్ట్రిబ్యూషన్లోనూ దూసుకుపోతున్నాడు. దిల్ రాజు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ క్రేజీ హీరో విజయ్ హీరోగా నిర్మిస్తోన్న బై లింగ్వుల్ భారీ బడ్జెట్ సినిమా వారసుడు సంక్రాంతికి రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ దెబ్బతో రాజు పాన్ ఇండియా లెవల్ ప్రొడ్యుసర్ అయిపోనున్నాడు.
అయితే ఇప్పుడు తమిళ డబ్బింగ్ సినిమాను కూడా తెలుగులో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలకు పోటీగా రిలీజ్ చేయడం.. అందులోనూ వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య కంటే ఎక్కువ థియేటర్లు, మంచి థియేటర్లలో రిలీజ్ చేయడం పెద్ద కాంట్రవర్సీకి కారణమైన సంగతి తెలిసిందే. ఇక రాజు తాజాగా ఓ ప్రముఖ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఈ క్రమంలోనే తేజస్వినితో తాను రెండో మ్యారేజ్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందన్న ఆసక్తికర విషయం కూడా బయటపెట్టారు. దిల్ రాజు మొదటి భార్య అనిత గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. అనిత పేరుతోనే రాజు బ్యానర్లో వచ్చే అన్ని సినిమాలు సమర్పకురాలిగా ఉంటాయి. అయితే నాలుగేళ్ల తర్వాత రాజు తేజస్వినిని రెండో పెళ్లి చేసుకోవడం.. ఈ దంపతులకు అన్వయ్రెడ్డి పుట్టడం జరిగాయి.
అయితే తన రెండో పెళ్లి గురించి చెప్పిన రాజు భార్య మరణం తర్వాత తాను మెంటర్‌గా డిస్టర్బ్ అయ్యానని.. దీంతో తన పేరెంట్స్ బాగా కుంగిపోయారని.. ఆ టైంలో తన కుమార్తె, అల్లుడు కూడా తన దగ్గరే ఉన్నారని.. అటు తల్లిదండ్రుల కోసం, ఇటు తన కుమార్తె ఎంకరేజ్ చేయడంతో తాను రెండో పెళ్లి చేసుకున్నానని రాజు తెలిపారు.
తన కుటుంబం సఫర్ కాకూడదన్న ఉద్దేశంతోనే తాను రెండో పెళ్లి చేసుకున్నానని.. 2020లో తేజస్వినితో తన రెండో వివాహం జరిగిందని.. తన రెండో పెళ్లి వెనక ఉన్న కథ రాజు చెప్పాడు. ఈ దంపతులకు ప్రస్తుతం అన్వయ్ రెడ్డి అనే వారసుడు ఉన్న సంగతి తెలిసిందే.