20 ఏళ్ల క్రితం ఎయిడ్స్ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించేసింది. ఆ తర్వాత ఎయిడ్స్ గురించి ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించడంతో కాస్త తగ్గింది. గత పదేళ్లలో ఎయిడ్స్, హెచ్ఐవీ పట్ల ప్రజల్లో పెరిగిన జాగ్రత్తలతో ఎయిడ్స్ వ్యాప్తి కంట్రల్లోనే ఉంటూ వస్తోంది. అయితే ఇప్పుడు మితిమీరిపోయిన, విచ్చలవిడి శృంగారంతో దేశంలో మళ్లీ హెచ్ఐవీ, ఎయిడ్స్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం 3.8 కోట్ల మంది ఎయిడ్స్‌తో బాధపడుతున్నారు. ఇది పశ్చిమాఫ్రికా దేశాల్లో ఇప్పటకీ ఎక్కువుగా ఉంది. ఇక మన దేశంలో కూడా గత పదేళ్లలో 17 లోల మంది ప్రజలకు హెచ్ఐవీ సోకినట్టు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ తెలిపింది. అయితే ఘోరమైన విషయం ఏంటంటే హెచ్ఐవీ వ్యాప్తి, విస్తరణలో మన తెలుగు రాష్ట్రం ఏపీ ముందు వరుసలో ఉంది. కేవలం రక్షణ లేని శృంగారం విచ్చలవిడిగా జరుగుతుండడంతో ఏపీలోనే 318814 హెచ్ఐవీ కేసులు నమోదయ్యాయి.
ఆ తర్వాత వరుసగా మధ్యప్రదేశ్ 284577 – కర్ణాటక 212 982 – తమిళనాడు 116536 తర్వాత స్తానాల్లో ఉన్నాయి. 2010 – 2020 మధ్య పదేళ్ల కాలంలోనే దేశంలో ఎయిడ్స్ / హెచ్ఐవీ కేసులు గణనీయంగా పెరిగిపోతుండడం తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. ఒకరికంటే ఎక్కువ మందితో శృంగారం, కలుషిత రక్తమార్పిడితో పాటు విచ్ఛలవిడి శృంగారం పట్ల యువత ఆకర్షితులు కావడం, వివాహేతర సంబంధాలు ఇవన్నీ ఈ వ్యాధి శరవేగంగా వ్యాప్తి చెందడానికి కారణమవుతున్నాయి.
ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆకలి, గూడు ఎంత నిత్యావసరమో శృంగారాన్ని కూడా అంతే నిత్యావసరంగా చూస్తున్నారు. దీనికి తోడు బయట చాలా మంది జీవనోపాధి కోసం దీనిని వృత్తిగా ఎంచుకోవడం, లగ్జరీ లైఫ్ కోసం అమ్మాయిలు డబ్బుకోసం శరీరం అమ్ముకోవడం ఇలా ఎన్నో కారణాలతో పాటు పాశ్చాత్యీకరణ, ఫ్యాషన్ ప్రపంచం ఇవన్నీ విచ్చలవిడి శృంగారానికి కారణమై ఈ వ్యాధి పెరగడానికి కారణమవుతున్నాయి.
ఇక గత పదేళ్లలో ఏపీలోనే అత్యధికంగా ఎయిడ్స్ కేసులు నమోదు అయ్యాయి. కేవలం కండోమ్ లేని శృంగారంతోనే ఏపీలో 318814 మందికి హెచ్ఐవీ సోకింది. మహారాష్ట్ర తర్వాత దేశంలోనే ఎక్కువ కేసులు ఉన్న రాష్ట్రాల్లో ఏపీ రెండో ప్లేసులో ఉంది.