యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ మీద రూమర్స్ కొత్తేం కాదు. ప్రభాస్ ఇప్పటికే 40 ఏళ్లు దాటేశాడు. ఇప్పటకీ పెళ్లి చేసుకోలేదు. ప్రభాస్ పెళ్లి టాపిక్ ఎప్పుడు వచ్చినా అది పెద్ద హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. ఇక అనుష్కతో ప్రభాస్ పెళ్లి అంటూ నాలుగైదేళ్లుగా రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. నిజంగానే వీరిద్దరు పెళ్లి చేసుకుంటే చూడాలనుకునే అభిమానులు కోట్లలోనే ఉన్నాయి. ఈ జంటకు అంత క్రేజ్ ఉంది.
విచిత్రం ఏంటంటే నాలుగు పదుల వయస్సు దాటేసిన ప్రభాస్… నాలుగు పదుల వయస్సుకు చేరువుగా ఉన్న అనుష్క ఇద్దరూ కూడా పెళ్లి చేసుకోకపోవడంతో వీరిద్దరిపై రకరకాల రూమర్లు సహజంగానే వస్తున్నాయి. ఇక ఇప్పుడు ప్రభాస్ – కృతిసనన్ ఎఫైర్ అంటూ సరికొత్త వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు నిజం అన్నట్టుగా ఓ బాలీవుడ్ హీరో మాట్లాడడం మరింత షాకింగ్‌గా మారింది.
ప్రస్తుతం ప్రభాస్ – కృతి జంటగా ఆదిపురుష్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతీసనన్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందన్న ప్రచారం బాలీవుడ్ మీడియాలో గట్టిగా వినిపించింది. అయితే ఇప్పుడు బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ చేసిన కామెంట్లు కూడా ప్రకపంనలు రేపుతున్నాయి.
వరుణ్ – కృతి జంటగా తాజాగా తోడేలు సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్లలో వీరు బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగా వీరు ఓ షోలో పాల్గొన్నారు. ఈ షోలో యాంకర్ కరణ్‌జోహార్ కృతిసనన్ పేరు నీ గుండెల్లో ఉందా ? అని వరుణ్‌ను అడిగాడు. వెంటనే వరుణ్ కృతి నేమ్ మరొకరి గుండెల్లో ఉంది.. అతడు ముంబైలో లేడు.. మరో చోట దీపికా పదుకొణేతో షూటింగ్లో పాల్గొంటున్నాడని వరుణ్ కామెంట్ చేశాడు.
వరుణ్ కామెంట్‌కు కృతి నవ్వుతున్నట్టు కనిపించినా.. కాస్త ఇబ్బందికర హ్యాండ్ మూమెంట్ ఇచ్చారు. ఈ హింట్ ప్రకారం ప్రభాస్ గుండెల్లో కృతి పేరుంది. ప్రస్తుతం ప్రభాస్ హైదరాబాద్‌లో దీపికా పదుకొనేతో కలిసి ప్రాజెక్ట్ కే షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఏదేమైనా ప్రభాస్ – కృతి ప్రేమపై వరుణ్ అంత కాన్ఫిడెంట్‌గా చెప్పడంతో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది.