టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మరణం నుంచి ఆయన అభిమానులు, ఆయన కుటుంబ సభ్యులు ఇంకా కోలుకోలేదు. ముఖ్యంగా కృష్ణ వారసుడు మహేష్‌బాబు ఆవేదన అంతా ఇంతా కాదు. ఈ యేడాదిలోనే అటు అన్న రమేష్‌బాబుతో పాటు తల్లి ఇందిరాదేవి, ఆ వెంటనే తండ్రి కృష్ణను కోల్పోవడంతో మహేష్ లోపల ఎంతో ఆవేదనతో ఉన్నాడు. నిన్న తండ్రి దశదినకర్మ సందర్భంగా మహేష్ ఎంతో భావోద్వేగంతో మాట్లాడాడు.
ఇక నిన్న నిర్వహించిన ఈ దశదిన కర్మను మహేష్ అంతా తానై నిర్వహించాడు. అటు కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు కూడా ఈ కార్యక్రమంలో కీ రోల్ ప్లే చేశారు. అటు పెద్దకొడుకు రమేష్‌బాబు లేకపోవడంతో మహేష్ తండ్రి దశదినకర్మను సంప్రదాయ బద్ధంగా, ఘనంగా నివాళిగా ఈ కార్యక్రమాలు చేశాడు. హైదరాబాద్‌లోని జేఆర్సీ ఫంక్షన్ హాలులో జరిగిన కార్యక్రమంకు ఐదువేల మంది అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చారు.
అభిమానులతో పాటు జనరల్ పబ్లిక్ కూడా అక్కడకు బాగానే వచ్చారు. వారికి రెండు రకాల మాంసాహార వంటకాలు, మిగిలిన శాకాహార వంటకాలతో వంటలు చేశారు. ఈ వంటకాలు అన్నీ జేఆర్సీ ఫంక్షన్ హాలువారే రెడీ చేశారు. ఇక్కడ అభిమానులతో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన 24 రకాల క్రాఫ్ట్స్ వారు భోజనాలు చేశారు. ఇక సెలబ్రిటీలతో పాటు, మీడియా వాళ్ల కోసం ఎన్ కన్వెషన్లో భోజనాలు ఏర్పాటు చేశారు.
ఈ భోజనాలు అన్నీ జూబ్లిహిల్స్‌లోని ప్రఖ్యాత స్పైసి వెన్యూ రెస్టారెంట్ రెడీ చేసింది. ఇందులో పలురకాల నాన్‌వెజ్ వంటకాలు కూడా ఉన్నాయి. ఇక ఈ కార్యక్రమానికి హీరో విక్టరీ వెంకటేష్‌తో పాటు నరేష్, పవిత్రా లోకేష్.. నరేష్ మాజీ భార్య, వారి పిల్లలు కూడా వచ్చారు. ఇంట్లో శాస్త్రోక్తంగా కృష్ణ పెద్దకర్మ కార్యక్రమం పూర్తయ్యాక కృష్ణ కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడకు వచ్చారు. ఇక రెండు చోట్లా జరిగిన ఈ కార్యక్రమాలకు మొత్తం రు 2.5 కోట్ల ఖర్చు అయ్యిందట. ఇదంతా మహేషే భరించాడు.