నాగచైతన్య – సమంత గురించి ఏ విషయం వచ్చినా కూడా మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ ఏ రేంజ్లో వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెళ్లయ్యాక నాలుగేళ్ల పాటు కాపురం చేసుకున్న ఈ జంట విడాకులు తీసుకుని పెద్ద షాక్ ఇచ్చారు. విడాకుల తర్వాత చైతు ఒకటి రెండు సందర్భాలు మినహా ఎప్పుడూ సమంత గురించి మాట్లాడింది లేదు. అయితే సమంత మాత్రం వీలున్నప్పుడల్లా చైతుపై ఏదో ఒక కామెంట్ చేస్తూనే వస్తోంది.
కొన్ని సార్లు డైరెక్ట్‌గా.. మరికొన్ని సార్లు ఇన్డైరెక్టుగాను సమంత ఈ కామెంట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే సమంత గతంలో నాగచైతన్యపై చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి చర్చకు వస్తున్నాయి. ఓ సినిమా ప్రమోషన్లో భాగంగా రాహుల్ రవీంద్రన్తో కలిసి సమంత, నాగచైతన్య పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రాహుల్ రవీంద్రన్ నాగచైతన్యకు ఓ ప్రశ్న వేశాడు. నవ్వు సమంతకు ఎప్పుడు ? ప్రపోజ్ చేశావు ? అనడంతో చైతు ఊహించని ఆన్సర్ ఇచ్చాడు.
సమంతను ఇంప్రెస్ చేసేందుకు తనకు ఏకంగా ఆరేళ్లు టైం పట్టిందని…వేరే ఆప్షన్ లేకే సమంతను పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. అయితే సమంత కూడా తాను తక్కువేం తినలేదన్నట్టుగా కౌంటర్‌గానే మాట్లాడింది. నాగచైతన్య ఏడేళ్లలో చాలా మంది అమ్మాయిల వెంటపడ్డాడు.. ఏడేళ్ల తర్వాత నా టోకెన్ నెంబర్ వచ్చింది.. అని తెలిపింది. దీంతో ఇప్పుడు కొందరు వీరిద్దరు గతంలో చేసుకున్న ఈ కామెంట్లను వైరల్ చేస్తున్నారు.
ఇక విడాకుల తర్వాత ఎవరి దారుల్లో వారు హ్యాపీగా ముందుకు వెళుతున్నారు. నాగచైతన్యకు లాల్‌సింగ్ చద్దా, థ్యాంక్యు సినిమాల రూపంలో రెండు పెద్ద డిజాస్టర్లు తగిలాయి. అటు సమంతకు యశోద లాంటి మంచి హిట్ దక్కింది. సమంత త్వరలోనే శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.