Moviesహిస్టరి రిపీట్స్.. బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ ఆ...

హిస్టరి రిపీట్స్.. బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ ఆ కంటెస్టెంటే.. తేల్చేసిన సెలబ్రిటీలు..!

తెలుగులోని అతిపెద్ద రియాలిటీ షో గా స్టార్ట్ అయిన బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే పలు భాషల్లో బిగ్ బాస్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది . కాగా తెలుగులో ఐదు సీజన్లు కంప్లీట్ చేసుకున్న బిగ్బాస్ త్వరలోనే ఆరో సీజన్ ను కంప్లీట్ చేసుకోబోతుంది. కాగా మరి కొద్ది రోజుల్లోనే బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ ఎపిసోడ్ జరగనుంది. ఈ క్రమంలోని హౌస్ లో ని కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి కొత్త ఉత్సాహాన్ని నింపారు.

కాగా రీసెంట్ గానే ఈ ఎపిసోడ్ లో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి సంబంధించిన ఫ్రెండ్స్ ని, ఫ్యామిలీ మెంబర్స్ ను నాగార్జున స్టేజ్ పైకి పిలిచి వాళ్లకు మర్చిపోలేని జ్ఞాపకాలను ఇచ్చాడు. కాగా ఈ క్రమంలో స్టేజ్ పైకి వచ్చిన ప్రతి ఒక్కరు.. అందరు కూడా బిగ్ బాస్ విన్నర్ అతడే అంటూ పరోక్షకంగా విన్నర్ ని ఫిస్ చేసారు. ఆయనే సింగర్ రేవంత్ . ఎస్ మొదటి నుంచి సింగర్ రేవంత్ టైటిల్ విన్నర్ అవుతాడు అంటూ జనాలు కూడా చెప్పుకొచ్చారు . కానీ మధ్యలో ఎక్కడో ఆయన యాంగ్రీ నెస్ కి జనాలు వెనకడుగు వేసారు.

కానీ ఈ మధ్యకాలంలో రేవంత్ చాలా కూల్ అయ్యాడు. పెర్ఫార్మెన్స్ కూడా హై రేంజ్ లో ఇస్తున్నాడు . అంతేకాదు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే . వీటన్నిటి దృష్ట్యా ఈసారి బిగ్ బాస్ విన్నర్ కచ్చితంగా రేవంత్ అవుతాడని జనాలు 80% ఫిక్స్ అయిపోయారు . 20% ఫిమేల్ కాంటెస్టెంట్ విన్నర్ అవ్వాలి అనుకున్న జనాలు ఫైమా కు ఓట్లు వేస్తారు అంటూ చెప్పుకొస్తున్నారు . అయితే సోషల్ మీడియాలో నడుస్తున్న టాక్ ప్రకారంగా ..ఇంటి సభ్యుల మైండ్ సెట్ ఆధారంగా ఈ సీజన్ విన్నర్ రేవంత్ అని ఫిక్స్ అయిపోయారు జనాలు.

అంతే కాదు స్టార్ సెలబ్రిటీలు సైతం రేవంత్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఆయనకి ఓట్లు వేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ కప్పు గెలవడం ఖాయం అంటూ ఆయన వైఫ్ కూడా చెప్పుకొచ్చింది . దీంతో రేవంత్ విన్ అయిపోయినట్లే అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే రేవంత్ విన్నర్ అవుతున్నాదు అని ఒకపక్క హ్యాపీగా ఉన్నా.. ఈసారైనా బిగ్ బాస్ కి లేడి కంటెస్టెంట్ విన్ అయితే బాగుండేది అనేది అమ్మాయిలా అభిప్రాయం . ఆఫ్ కోర్స్ బిగ్ బాస్ ఓటిటి కి బిందు మాధవి కప్పు కొట్టినా బిగ్బాస్ 6 లో లేడీ కప్పు కొడితే చూడాలన్నది మహిళల కల . చూద్దాం ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news