నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టార్ సన్ గా ఇండస్ట్రీలోకి పరిచయమైన నరేష్.. అల్లరి సినిమాతో ఫస్ట్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ ను మర్చిపోలేని నరేష్ ..అల్లరి నరేష్ గా తన పేరు మార్చుకున్నారు. ఇప్పటికీ జనాలు ఇతనిని అల్లరి నరేష్ అని పిలుస్తూ ఉంటారు . అంత బాగా ఫస్ట్ సినిమాతోనే జనాలను నవ్వించాడు . అంతే కాదు ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా కామెడీ జోనర్ లోనే నెట్టుకొచ్చాడు.
అల్లరి నరేష్ ఈ క్రమంలోనే కామెడీ హీరో అంటూ జనాలు ప్రత్యేకంగా గుర్తించారు. స్టార్ హీరోల సినిమాలైనా ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయేమో కానీ.. అల్లరి నరేష్ నటించిన సినిమా ఫ్లాప్ అవ్వదు ..కచ్చితంగా కడుపుబ్బ జనాలు నవ్వుకోవచ్చు అన్న ఓ మాటను సంపాదించుకునేసాడు. అంతేకాదు కామెడీ పరంగా కెరియర్ ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతున్న టైం లో అల్లరి నరేష్ రూట్ మార్చి కంటెంట్ ను తప్పుదోవ పట్టించుకునే సినిమాలను సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే జనాలు ఆయన నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు.
ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి దూరంగా ఉన్న నరేష్ ..మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. వచ్చిన అవకాశాలలో నచ్చిన సినిమాలు చేస్తూ జనాలని మెప్పిస్తున్నాడు. కాగా రీసెంట్గా ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం అనే సినిమాతో జనాల ముందుకు వచ్చారు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ ..అల్లరి నరేష్ తన వైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ” నా వైఫ్ పేరు విరుపా . తన పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే. తెలుగు గురించి పెద్దగా తెలియదు. తెలుగు సినిమాల గురించి అసలు అవగాహన లేదు. అరాకొరా సినిమాలు చూసిన కూడా బిగ్ స్టార్ సినిమాలు మాత్రమే చూసింది. ఆమెకి నన్ను పెళ్లి చేసుకునే వరకు నేను హీరో అని కూడా తెలియదు. సినిమా ఫీల్డ్ లో ఉన్నారంటే వేరే డిపార్ట్మెంట్లో ఉన్నారేమో అనుకునిందట . హీరో అని నన్ను పెళ్లి చేసుకున్న తర్వాతే తెలిసింది” అంటూ నరేష్ చెప్పుకొచ్చాడు.