నటి నిశాంతి గుర్తుందా ? అసలు ఈ పేరు అంటేనే చాలా మంది గుర్తు పట్టరు. మనకు తెలియని నిశాంతి ఎవరబ్బా అని బుర్ర బద్దలు కొట్టుకుంటారు. నిశాంతి అంటే ఎవరో కాదు.. నిన్నటి తరం సీనియర్ హీరోయిన్ భానుప్రియ చెల్లి శాంతిప్రియ. శాంతిప్రియ పేరు తర్వాత నిశాంతిగా మార్చుకుంది. ఆమె 1990వ దశకంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. శాంతిప్రియ 1988లో వచ్చిన తమిళ సినిమా ఎంగ ఊరు పాటుక్రన్ (1988) సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. ఈ సినిమా ఆమె కెరీర్లోనే అతి పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.
ఆ తర్వాత ఆమె 2002లో ముఖేష్ ఖన్నా సరసన ఆర్యజమాన్ బ్రహ్మాండ్ కా యోధ సినిమాలో నటించింది. ఇక నిశాంతి అప్పటి బాలీవుడ్ క్రేజీ హీరో మిథున్ చక్రవర్తికి కూడా జోడీగా పలు సినిమాల్లో నటించింది. అప్పట్లో ఆమె కోలీవుడ్‌లో పక్కింటి అమ్మాయి ఇమేజ్‌తో ఓ వెలుగు వెలిగింది. మేరే సజనా సాత్ నిభానా, ఫూల్ ఔర్ అంగార్, మెహెర్బాన్ వంటి వహిట్ సినిమాల్లో నటించింది.
ఇక తెలుగులో ఆమె అక్క భానుప్రియ గాడ్ ఫాదర్ అయిన డైరెక్టర్ వంశీ మహర్షి సినిమాతో ఆమె ఎంట్రీ ఇచ్చింది. అయితే తెలుగులో అక్క అంత పాపులర్ కాలేదు నిశాంతి. మహర్షి తర్వాత సింహస్వప్నం, రక్తకన్నీరు, నాకూ పెళ్లాం కావాలి, అగ్ని వంటి సినిమాల్లో నటించింది. ఇక శాంతి ప్రియ హీరోయిన్గా మంచి ఫామ్‌లో ఉన్నాక 1999లో వి. శాంతారం మనవడు అయిన సిద్ధార్థ్ రాయ్‌ను పెళ్లాడింది.
అయితే విధి ఆమె జీవితంతో వింత ఆట ఆడింది. పెళ్లైన ఐదేళ్లకే నిశాంతి భర్త 2004లో గుండె నొప్పితో చనిపోయాడు. ఆమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇక చాలా యేళ్ల తర్వాత నిశాంతి బాలీవుడ్లో ధారవి బ్యాంక్ అనే వెబ్‌సీరిస్‌తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సీరిస్‌లో ఆమె బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి చెల్లి పొన్నమ్మగా నటించింది.
ఇక ఇప్పుడు ఆమె వెండితెరపై రీ ఎంట్రీ ఇస్తోంది. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు కవయిత్ర సరోజనీ నాయుడు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమాతో ఆమె వెండితెరపై కనిపించనుంది. ఇది పాన్ ఇండియా సినిమా. ఈ బయోపిక్‌ను 2022 జూలైలో సెట్స్ మీదకు తీసుకు రానున్నారు.