అమీ జాక్సన్ ..ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . పేరు కు బ్రిటన్ అమ్మడు అయినా తెలుగు, తమిళ్, హిందీ సినిమాలు చేస్తూ తన అందాలతో ఇక్కడ కూడా హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అమ్మడు చాలా బోల్డ్ ..మాట్లాడే మాటలే కాదు..ప్రవర్తన కూడా చాలా బోల్డ్ గా ఉంటుంది . పెళ్లికి ముందే ఇష్టమైన అబ్బాయితో డేటింగ్ చేసి బిడ్డను కాన్నేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత అతనితో బ్రేకప్ చెప్పేసి అందరికి షాక్ ఇచ్చింది .
అంతేకాదు ఎప్పటికప్పుడు తన హెల్త్ గురించి బాడీ ఫిట్నెస్ గురించి ఎక్కువ కేర్ తీసుకునే అమీ జాక్సన్ ..లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి. దానికి మెయిన్ రీజన్ ఆమె పూర్తిగా ఏదో పేషెంట్ లాగా తయారయింది. శరీరంలో ఎముకలు కనిపించే విధంగా సన్నబడి జనాలకు లేనిపోని డౌట్ లు క్రియేట్ చేసింది. అమీ జాక్సన్.. ఐ సినిమాలో విక్రమ్ కి జంటగా నటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఎవడు సినిమాలో చరణ్ తో కూడా ఆడి పాడి అలరించింది. ఈ సినిమాలో అమ్మడు డాన్స్ పెర్ఫార్మెన్స్ కి హ్యూజ్ కామెంట్స్ వినిపించాయి. అంతే కాదు మెగాస్టార్ సైతం అమీ జాక్సన్ చరణ్ తో పోటీగా స్టెప్పులు వేసింది అంటూ ఓ రేంజ్ లో పొగిడేసారు .
కాగా అలాంటి కాంప్లిమెంట్స్ అందుకున్న అమీ జాక్సన్ ఎందుకో అవకాశాలు దక్కించుకోలేకపోయింది . అంతేకాదు ప్రొఫెషన్ కన్నా పర్సనల్ లైఫ్ పై కాన్సన్ట్రేషన్ చేసి ఇండస్ట్రీకి దూరమైంది . ఇండస్ట్రీకి దూరమైన సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు అభిమానులతో టచ్ లో ఉండే అమీ జాక్సన్ ..రీసెంట్గా అవార్డు ఫంక్షన్స్ కు అటెండ్ అయింది . అక్కడ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోస్ లో అమ్మీ జాక్సన్ చాలా సన్నగా ముఖం లాగేసి ఏదో జబ్బు మనిషిలాగ కనిపించింది. అంతేకాదు ఈ ఫొటోస్ చూసిన జనాలు కూడా ఏదో భయంకరమైన వ్యాధి వచ్చి తగ్గిపోయిన మనిషిలా ఉన్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ -బాలీవుడ్ -కోలీవుడ్ జనాలకు అమ్మడు ఫేవరేట్ హీరోయిన్ కావడంతో .. ఈ ఫొటోస్ చూసిన ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ఆమె ఫ్యాన్స్ ఈ ఫొటోస్ చూసి సమంత అలాగే ఈమె కూడా ఏమైనా భయంకరమైన జబ్బుతో బాధపడుతుందా…? లేకపోతే ఇంత తగ్గిపోవడం ఏంటి ..? అంతకుముందు కూడా బొద్దుగా ఉండేది కాదు కానీ ..చాలా క్యూట్ గా ఉండేది . అయితే రీసెంట్ ఫొటోస్ మాత్రం చాలా భయంకరంగా జబ్బు పడిన మనిషిలాగ కనిపిస్తుంది . దీనిపై అమీ జాక్సన్ నోరు విప్పితే కానీ సమాధానం దొరకదు . చూడాలి మరి అమీ జాక్సన్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో..?