బాల్యం అనేది ఎవరికి అయినా ఓ మరపురాని మధురానుభూతి. బాల్యం జ్ఞాపకాలు అపురూపంగా ఉంచుకోవాలి. బాల్యంలో నటులుగా రాణించిన ఎంతోమంది పెద్దయ్యాక కూడా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అవుతూ ఉంటారు. అయితే చిన్నప్పుడు సినిమాల్లో మంచి పాత్రలు వేసి పెద్దయ్యాక స్టార్లుగా కొనసాగే అదృష్టం కొద్దిమందికే దక్కుతుంది. తరుణ్, బాలాదిత్య లాంటి వాళ్లు చిన్నప్పుడు సినిమాలు చేసి మెప్పించారు. అయితే పెద్దయ్యాక వాళ్లు స్టార్ హీరోలు అయితే కాలేదు.
మహేష్‌బాబు చిన్నప్పుడు వెండితెరను షేక్ చేస్తే పెద్దయ్యాక సూపర్‌స్టార్ అయ్యాడు. ఇక పై ఫొటోలో కనిపిస్తోన్న ఓ బడుతడు కూడా ఇప్పుడు టాలీవుడ్లో సీనియర్ హీరో, స్టార్ హీరోగా ఉన్నాడు. ఆ హీరో ఎవరు మీరు గుర్తు పట్టారా.. విక్టరీ వెంకటేష్. పై ఫొటోలో ఉన్న వెంకటేష్ దివంగత లెజెండ్రీ హీరో ఏఎన్నార్ సూపర్ హిట్ సినిమాలో నటించారు.వెంకటేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చి కుటుంబ కథా చిత్రాలతో మహిళా ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అయితే వెంకటేష్ తండ్రి దివంగత నిర్మాత రామానాయుడు.
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో భారతదేశంలోని అన్ని భాషల్లోనూ సినిమాలు తీసిన నిర్మాతగా పేరు గడించారు. వాళ్ల బ్యానర్లో నాటి తరం, నేటి తరం హీరోలు అందరితోనూ సినిమాలు తీశారు ఆయన. ఈ క్రమంలోనే ఆయనకు ఒకప్పుడు వియ్యంకుడు అయిన ఏఎన్నార్‌తో తన బ్యానర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. ఈ క్రమంలోనే వచ్చిన సూపర్‌హిట్ సినిమా ప్రేమ్‌నగర్ సినిమాలో వెంకటేష్ బాలనటుడిగా కనిపించాడు.
1971లో రిలీజ్ అయిన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అయ్యింది. ఈ క్రమంలోనే ఏఎన్నార్ అన్నగా సత్యనారాయణ నటించగా.. చిన్నప్పటి సత్యనారాయణ పాత్రలో వెంకటేష్ నటించాడు. ఆ తర్వాత వెంకటేష్ పెద్దయ్యాక తమ బ్యానర్లోనే 1986లో వచ్చిన కలియుగ పాండవులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఖుష్బూ హీరోయిన్గా చేసిన ఈ సినిమాకు కె. రాఘవేంద్రరావు దర్శకుడు.