టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న హన్సిక మోత్వాన్ని.. ఎట్టకేలకు ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. గత కొన్ని నెలలుగా హన్సిక పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ గా మారాయో మనకు తెలిసిందే . కాగా రెండు వారాల క్రితం హన్సిక తన కాబోయే భర్తను పరిచయం చేస్తూ అఫీషియల్ గా తన భర్తను జనాలకు ఇంట్రడ్యూస్ చేసింది . ఈఫిల్ టవర్ దగ్గర అతను ప్రపోజ్ చేస్తున్న పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ “ఐ లవ్ యు టూ” అంటూ ఓపెన్ గానే తన బంధాన్ని బయటపెట్టింది.
హన్సిక కాబోయే భర్త పేరు సోహెల్ ఖతురియా. ఇతడు ముంబైలో పెద్ద బిజినెస్ మ్యాన్. కోట్ల ఆస్తికి వారసుడు . కాగా హన్సిక పెళ్లి విషయంలో బిగ్గెస్ట్ ట్వీస్ట్ ఏంటంటే ఇది రెండో పెళ్లి . ఆల్రెడీ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని కొన్నాళ్ళు కాపురం చేశాక . ఆమెకి విడాకులు ఇచ్చేసాడు. ఆ అమ్మాయి మరెవరో కాదు హన్సిక బెస్ట్ ఫ్రెండ్ . ఎస్ వీళ్లిద్దరి పెళ్లికి హన్సిక వెళ్లి ఆడి పాడి అలరించింది . కాగా ఇప్పుడు అతనిని రెండో పెళ్లి చేసుకోబోతుంది . దీంతో జనాలు షాక్ అవుతున్న ..పెద్దగా కేర్ చేయట్లేదు హన్సిక .
కాగా డిసెంబర్ 4వ తేదీ వీరి పెళ్లి గ్రాండ్గా రాజస్థాన్లోని జైపూర్ లోని ఓ రాజకోటలో జరగబోతుంది . ఇందుకు సంబంధించిన పనులు మొత్తం ఎప్పుడో కంప్లీట్ చేసిన హన్సిక ..తన పెళ్లికి వేసుకునే అభరణాలను సైతం స్పెషల్ గా చేయించుకుంటుంది. కాగా రీసెంట్గా వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫస్ట్ కార్యాన్ని మొదలుపెట్టారు . ” మాతాకీ చౌకి ” అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కుటుంబ సభ్యుల సమక్షంలో కాబోయే వధూవరులు ఇద్దరు దుర్గాదేవి పూజలో పాల్గొంటారు . వాళ్ళ ఆచార ప్రకారం ఇప్పటినుంచి వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అయిపోయినట్లే . కాగా ఈ పూజకి అటెండ్ అవుతూ హన్సిక రెడ్ శారీలో దేవతల కనిపించింది. అయితే, పెళ్లి కి ముందే ఒక్కే కారు జామ్ జామ్ అని ఎంజాయ్ చేసిన వీళ్లు..ఎప్పుడో మ్యాటర్ ఫినిష్ చేసి ఉంటారు అంటూ జనాలు చెప్పుకువస్తున్నారు. అంతేకాదు, ఫ్రెండ్ వదిలేసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం.. ఏంటి ఈ సాంప్రదాయం అంటూ ఫైర్ అవుతున్నారు.