నందమూరి నటసింహం బాలయ్య సినిమా అంటే గత కొద్ది రోజులుగా డబుల్ రోల్ అన్నది అలవాటు అయిపోయింది. సింహా, లెజెండ్, అఖండ మాత్రమే కాదు.. మధ్యలో లయన్, రూలర్ సినిమాల్లోనూ బాల్య అయితే డ్యూయెల్ రోల్ చేయడం లేదా ఒకే పాత్ర రెండు షేడ్స్‌లో చూపించడం… చూడడం అందరికి అలవాటు అయిపోయింది. ఇక సంక్రాంతికి రిలీజ్ అవుతోన్న వీరసింహారెడ్డి సినిమాలోనూ బాలయ్య డ్యూయెల్ రోల్లోనూ కనిపించనున్నాడు.
ఈ క్రమంలోనే బాలయ్య తన 108వ ప్రాజెక్టులో కూడా డ్యూయెల్ రోల్ చేస్తున్నాడంటూ కొద్ది రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమా తర్వాత ఈ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 8 నుంచి ఈ సినిమా హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. ముందుగా బాలయ్య జైలులో ఉండే సన్నివేశాలు చిత్రీకరిస్తారు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ సినిమా నిర్మించనున్నాడు.
అయితే ఈ సినిమాలో బాలయ్య రోల్ ఎలా ఉంటుందో అనిల్ రావిపూడి లీక్ చేసేశాడు. బాలయ్యది డబుల్ రోల్ కాదు… సింగిల్ రోల్ అని క్లారిటీ ఇచ్చేశాడు. అఖండ, వీరసింహారెడ్డిలా డ్యూయెల్ రోల్ ఉండదని కూడా అనిల్ హింట్‌తో క్లారిటీ వచ్చేసినట్లయ్యింది. ఇక బాలయ్య కూతురుగా యంగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. బాలయ్య పాత్ర 55 ఏళ్ల వయస్సు మళ్లిన వ్యక్తి పాత్రలో ఉంటుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు. ఏదేమైనా బాలయ్య పాత్ర మధ్య వయస్సు వ్యక్తిగా ఉండడంతో పాటు సింగిల్ రోల్ అన్నది అయితే క్లారిటీ వచ్చేసింది.
డిసెంబర్ 8 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయితే… కంటిన్యూగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనిల్ రావిపూడి ఇప్పటికే వరుసగా ఆరు హిట్లతో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఫస్ట్ టైం బాలయ్య లాంటి మాస్ హీరోను డైరెక్ట్ చేస్తుండడంతో కాంబినేషన్‌కు మంచి క్రేజ్ అయితే వచ్చేసింది.