`అంజిగాడు` అనే క్యారెక్టర్ గుర్తుందా? పాతాళ భైరవిలో అన్నగారు ఎన్టీఆర్ పక్కన సహాయకుడిగా నటిం చిన.. బాలకృష్ణ అనే క్యారెక్టర్ ఆర్టిస్టును ఇప్పుడు అందరూ మరిచిపోయారు. కానీ, ఈయనకు చాలానే హిస్టరీ ఉంది. ఇప్పుడు ఎలా అయితే.. బ్రహ్మానందాన్ని అందరూ అనుకరిస్తున్నారో.. అనుసరిస్తున్నారో.. అప్పట్లో బాలకృష్ణ..ఉరఫ్ అంజిని కూడా అందరూ అనుకరించేవారు.
అప్పట్లో యాడ్‌లు ఉండేవి. ఇప్పుడు మనకు యూట్యూబ్‌లో వచ్చినట్టుగా! అయితే.. అప్పట్లో ట్యూబులు లేవు కదా.. కేవలం పత్రికల్లో మాత్రమే.. యాడ్‌లు వచ్చేవి. షాంపులు వాడకం..అప్పట్లోనే ప్రారంభమైంది. అది.. 1940-50 మధ్య కాలం. ఆ సమయంలో వీటికి యాడ్లు చేసింది కూడా అంజే. అంతెందుకు.. బ్లాక్ అండ్ వైట్ మూవీల్లో కితకితలు పెట్టిన రాజబాబు కూడా అంజి మాదిరిగానే చేసాడంటే నమ్మలేం కదా! కానీ, నిజం.
ఐదో తరగతి తోనేచదువు ఆపేసిన అంజి.. నాటకాలపైపడ్డాడు. అయితే.. ఇప్పుడు సినిమాల్లో ఎలా అయి తే.. కాంపిటీషన్ జోరుగా ఉందో.. అప్పట్లో నాటకాల్లో పోటీ అలా ఉండేది. దీంతో అంజి మనసు సినిమాలపై మళ్లింది. ఇప్పుడంటే హైదరాబాద్.. 1950ల సమయంలో మద్రాస్. కానీ, దీనికి ముందే.. అంజి రంగ ప్రవేశం చేశాడు. సో.. అప్పట్లో కలకత్తాలోనే సినిమా షూటింగులు జరిగేవి. చేతిలో చిల్లి గవ్వకూడా లేకుండా.. రైళ్లు మారి మారి.. అక్కడకు చేరుకుని.. సినిమాల్లో ఛాన్స్ కొట్టాడు.
ఇక్కడో పెద్ద చరిత్ర ఉంది.(అది అవసరం లేదనుకుంటా). కానీ, జీవితంలో ఎలా ఉండాలో.. సినిమాల్లోనూ అలానే అంత డిసిప్లిన్‌గా ఉన్నాడు అంజి. ఆ రోజుల్లో క్యామెడీకి పెట్టింది పేరు అంజి. ఈయన సహాయ నటుడిగానేకాదు.. అత్యంత క్యామెడీ ఆర్టిస్టుగా.. కడుపుబ్బ నవ్వించేవాడు. సినిమాల కోసం ఎగబడే వాడు కాదు.. ఎందుకంటే.. సినిమాలే.. ఆయన కోసం ఎగబడి వచ్చేవి. చివరి దశలోనూ దర్జాగానే పోయాడు. ఇప్పటికీ.. టీ నగర్‌లో ఈయన స్మారకం ఉండడం గమనార్హం.