ఎస్ ఈ టైటిల్ బాలయ్యకు కరెక్ట్ గా సరిపోతుంది. బాలయ్య ఎవరినైనా ప్రేమించాడు అంటే ఇక వెనకా ముందు ఏం చూడడు.. వాళ్ళపై తనకున్న అపారమైన ప్రేమను కుమ్మరించి పడేస్తాడు. అటువైపు ఎంత పెద్ద వ్యక్తి ఉన్న తనకు సరిపడకపోతే లైట్ తీసుకుంటాడు. అదే సమయంలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని వాళ్ళు చిన్న హీరోలు ఉన్నా కూడా తనకు నచ్చితే వెంటనే నెత్తిన పెట్టేసుకుంటాడు. ముఖ్యంగా అన్ స్టాపుల్ షోకు నాని, శర్వానంద్, విశ్వక్సేన్, సిద్దు జొన్నలగడ్డ లాంటి కుర్ర హీరోలను తీసుకువచ్చి వాళ్ల అంతరంగాల్లోకి తొంగి చూసేంతగా ప్రశ్నలు వేసి షోను నడిపిస్తున్న తీరు అయితే రచ్చ లేపుతోంది.
అందుకే సోషల్ మీడియాలో ఇప్పుడు అన్స్టాపబులల్ షోకు బాగా క్రేజ్ వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ షో వీడియోలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా విశ్వక్సేన్ ధమ్కీ సినిమా ఆడియో రిలీజ్‌కు ముఖ్య అతిథిగా వచ్చాడు. రీసెంట్గా విశ్వక్సేన్కు కాస్త నెగటివ్ ట్రెండ్ అయితే స్టార్ట్ అయ్యింది. మామూలుగా విశ్వక్సేన్ స్లాగ్‌తో తనకంటూ ఓ సెక్షన్ ఆడియెన్స్‌లో అభిమానం సంపాదించుకున్నాడు.
అయితే అశోకవనంలో అర్జునకళ్యాణం సినిమా టైం నుంచి టీవీ 9 ఛానెల్లోకి ఎంట్రీ ఇచ్చి రచ్చ చేయడం.. ఆ ఫ్రాంక్ వీడియో దెబ్బతో కొందరు మనోడిని టార్గెట్ చేశారు. ఇక సీనియర్ హీరో అర్జున్ సొంత సినిమాకు తన కుమార్తె ఐశ్వర్య పక్కన విశ్వక్‌ను తీసుకుంటే పెద్ద వివాదం జరిగింది. చివరకు సినిమా నుంచి తాను తప్పుకుంటున్నట్టు విశ్వక్ ప్రకటించడం, ఆ తర్వాత అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టి మరీ విశ్వక్సేన్పై విమర్శలు చేయడం చూశాం.
విశ్వక్‌కు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది కాదనలేం. అయితే కొందరు యంగ్ హీరోలకు కూడా అతడంటే ఎందుకో ? పడదని అంటారు. కారణం అతడి స్లాగ్, తక్కువ టైంలో క్రేజ్ రావడమే అన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్నాయి. ఇప్పుడు అలాంటి విశ్వక్ టైటిల్ పోస్టర్ రిలీజ్ ఫంక్షన్‌కు బాలయ్య ముఖ్య అతిథిగా రావడం గొప్ప విషయం. ఇటీవల అన్స్టాపబుల్కు విశ్వక్, సిద్ధు జొన్నలగడ్డ వచ్చి నానా హడావిడి చేశారు.
బాలయ్య ఈ వేడుకకు రావడం.. తెలంగాణ స్లాగ్‌లో మాట్లాడడం.. జై బాలయ్య నినాదాలు ఇవన్నీ విశ్వక్ ఓన్‌గా రిలీజ్ చేసిన ధమ్కీ సినిమాపై మంచి హైప్ రావడానికి కారణం అయ్యాయి. రీసెంట్గా అల్లు అర్జున్ ఊర్వశివో.. రాక్షసివో సినిమా ఫంక్షన్‌కు వస్తే సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఇప్పుడు విశ్వక్ సినిమా ఫంక్షన్‌కు కూడా వచ్చాడు. ఏదేమైనా ఇప్పుడు నడుస్తోందంతా బాలయ్య కాలమే.. అందుకే ఎవరు ఏమనుకున్నా.. బాలయ్య ప్రేమిస్తే అటు వైపు ఎవరు ఉన్నారు అన్నది చూడడు… వాళ్లపై అంత ప్రేమ కురిపించేస్తాడు. మరి ఇది విశ్వక్ సినిమాకు ఎంత వరకు హెల్ఫ్ అవుతుందో ? చూడాలి.