తెలుగు సోషల్ మీడియా వాళ్లకు, వెబ్సైట్, యూట్యూబ్ వాళ్లకు ఇప్పుడు సీనియర్ నటుడు నరేష్, పవిత్రా లోకేష్ జంట మంచి హాట్ టాపిక్‌గా మారిపోయారు. గత ఆరేడు నెలలుగానే వీళ్లిద్దరు వార్తల్లో హైలెట్స్‌లో ఉంటున్నారు. తాజాగా కృష్ణ మృతితో యావత్ తెలుగు జనాలు తీవ్రదుంఖంలోకి వెళ్లిపోయారు. కృష్ణకు నివాళులు అర్పించేందుకు ఎంతోమంది ప్రముఖులు, సినిమా, రాజకీయ రంగాలకు చెందిన వాళ్లంతా వచ్చారు.
అయితే కృష్ణ మృతదేహం పక్కన ఉండగానే నరేష్, పవిత్రా లోకేష్ ప్రవర్తించిన తీరును చాలా మంది తప్పుపడుతున్నారు. వీరి బిహేవియర్‌పై పెద్ద ఎత్తున విమర్శలతో పాటు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రోలింగ్ నడుస్తోంది. ఓ వైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహేష్, నమ్రతను పరామర్శిస్తుంటే నరేష్ మధ్యలో జోక్యం చేసుకోవడంతో కేసీఆర్ ఇక ఆపు అన్నట్టుగా సైగ చేయడం చాలా మంది ట్రోల్ చేస్తున్నారు.
అసలు ఈ కార్యక్రమం అంతా నరేష్, పవిత్రా లోకేష్ హంగామాతో కనిపించేందుకు పాట్లు పడినట్టుగా ఉందన్న చర్చలు కూడా నడుస్తున్నాయి. నరేష్‌ను చాలా మంది పట్టించుకోలేదు.. ఆయన తనకు తానే అటూ ఇటూ తిరుగుతున్నాడు. పవిత్ర కూడా నరేష్ చుట్టూ తిరిగింది. ఇప్పటికే నరేష్‌కు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. తన వ్యక్తిగత జీవితంపై చాలా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అసలు కృష్ణ, విజయనిర్మల ఇద్దరూ రెండో పెళ్లి చేసుకున్నా వారి వ్యక్తిగత, వైవాహిక జీవితాన్ని ఏనాడూ ఎవ్వరూ ఎత్తి చూపలేదు.
కానీ నరేష్ ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుని ఇప్పటికే చాలా అభాసుపాలైపోయాడు. దీనికి తోడు ఇప్పుడు పవిత్రా లోకేష్‌తో సహజీవనం చేయడం కృష్ణ గారికే నచ్చలేదని అంటున్నారు. అన్నింటికి మించి నరేష్ తాను సహజీవనం చేస్తున్నట్టుగా వార్తలు వస్తోన్న నేపథ్యంలో పవిత్రా లోకేష్‌ను తన తండ్రి మృతదేహం దగ్గరకు తీసుకురావడం ఘట్టమనేని ఫ్యామిలీ పరువు తీసేసినట్టు అయ్యిందనే అంటున్నారు.
ఇక నరేష్ కంటే కూడా పవిత్రా లోకేష్ బిహేవియర్‌తో పాటు ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌ను సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్లు పెట్టి మరీ ఆడేసుకుంటున్నారు. అంతమందిలోనూ నరేష్‌కు ఆమె చాలాసార్లు కనుసైగలు చేసింది. అది చాలా అతిగా అనిపించింది. వాటర్ తాగుతావా ? అన్నట్టుగా సైగలు చేయడం, కళ్లు ఎగరేస్తూ ఇక్కడ ఇంకెంత సేపు ఉండాలన్నట్టుగా అసహనంతో ఉండడం చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు.
మరోవైపు నరేష్ కూడా ఆమె భుజం మీద చేతులు వేస్తూ ఉండడం, మధ్యలో ఆమె నరేష్ వైపు చూస్తూ ఉండడం ఎబ్బెట్టుగా ఉంది. ఇక కృష్ణ మరణంతో సీనియర్ నటుడు మోహన్‌బాబు తీవ్ర భావోద్వేగంతో మాట్లాడుతుంటే నరేష్ పక్కన ఉన్నాడు. కృష్ణ కుటుంబ సభ్యుల పక్కన వారిని ఓదార్చాల్సిన పవిత్ర నరేష్ పక్కన వాలిపోయింది. మోహన్‌బాబు మాట్లాడుతుంటే ఇంకా ఎంత సేపు… ఈయన ఎప్పటకి ఆపుతాడు… ఈ సోదంతా ఇప్పుడు అవసరమా ? అన్నట్టుగా ఆమె ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయని చాలా మంది ఫైర్ అవుతున్నారు.
కేవలం నెటిజన్లు మాత్రమే కాదు… కృష్ణ సన్నిహితులు, ఆయన మేకప్‌మేన్, సీనియర్ సినీ ఎనలిస్టులు ఈమంది రామారావు, భరద్వాజ్‌తో పాటు దాసరి విజ్ఞాన్ లాంటి వాళ్లు అందరూ కూడా నరేష్‌తో పాటు పవిత్రా లోకేష్ ఓవర్‌యాక్షన్‌పై ఆటాడుకోవడంతో పాటు అసలు వీళ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతమంచిదని వీళ్లను తేలిగ్గా తీసుకోవాలన్నట్టుగా చెప్పారు. ఏదేమైనా విజయనిర్మల మరణం తర్వాత నరేషే కృష్ణకు అన్నీ దగ్గరుండి చూసుకున్నాడని అంటారు.. అయితే ఇప్పుడు మాత్రం పవిత్ర వల్ల తీవ్ర విమర్శుల ఎదుర్కోక తప్పడం లేదు.