తెలుగు నిర్మాత డిస్ట్రిబ్యూటర్ ముఖ్యంగా నైజాం నిర్మాతగా నిలబడిన దిల్ రాజు శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు సీక్వల్ ఇండియన్-2ని ప్రొడ్యూస్ చేస్తున్నాడని తెలిసిందే. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే ఈ సినిమా అవకాశం దిల్ రాజుకి ఎలా వచ్చింది అన్నది హాట్ టాపిక్ అయ్యింది.
ఓ పక్క భారతీయుడు నిర్మాత ఏ.ఎం.రత్నం సీక్వల్ సినిమాకి రాయల్టీ అడుగుతున్నాడట. అంతేకాదు దిల్ రాజు 200 కోట్ల బడ్జెట్ పెట్టేంత సినిమా లేదు. ఇన్ని ప్రశ్నలు ముందుండగా ఇప్పుడు ఇండియన్-2 దిల్ రాజు చేతుల్లోనుండి లైకా ప్రొడక్షన్స్ చేతుల్లోకి వచ్చిందని కోలీవుడ్ టాక్.
ఇండియన్-2 మీద జరుగుతున్న ఈ చర్చలు చూస్తుంటే దిల్ రాజు ఎందుకొచ్చిన గొడవయ్యా నీకు ఎలాగు నైజాంలో నువ్వే కింగ్ వు కాబట్టి ఆ సినిమా రైట్స్ ఏదో కొనేస్తే పోలా అంటూ ఉచిత సలహాలిస్తున్నారు. అయితే ఇక్కడ దిల్ రాజు ఆలోచించే విషయం ఏంటంటే సినిమా బడ్జెట్ కు 200 కోట్లు పెడితే బిజినెస్ దాదాపు 500 కోట్లు దాటే అవకాశం ఉంటుంది. అందుకే తెలివిలిగా కెరియర్ లో ఎన్నడు లేని విధంగా 200 కోట్ల బడ్జెట్ కు ఓకే అన్నాడని అంటున్నారు. మరి అసలు ఇండియన్-2 నిర్మాత ఎవరు అన్న దాని మీద ఓ క్లారిటీ రావాల్సి ఉంది.