సొగ్గాడే చిన్నినాయన ఫేం కల్యాణ్ కొత్త సినిమాని షురూ చేశాడు
కానీ ఇంతలోనే ఓ రూమర్ వచ్చేసింది.. ఈ చిత్రాన్ని నాగ్ తో కాక రవితేజతో చేస్తున్నాడని.
దీంతో డైరెక్టర్ నేరుగా రంగంలోకి దిగి వివరణ ఇచ్చి గాసిప్ రాయుళ్ల నోరు మూయించాడు.
ఇంతకూ ఆయనేమన్నారంటే..”అసలు ఆ రూమర్ ఎలా వచ్చిందో తెలియదు. బంగార్రాజు స్ర్కిప్ట్ ఒక వెర్షన్ రాసిన మాట వాస్తవం. అది నాగార్జున సర్ కు అంతగా నచ్చలేదు. అందుకే దానిని వేరే తరహాలో డెవలప్ చేస్తున్నాను. ఆ సీక్వెల్ మూవీ ఎప్పటికైనా ఆయనతోనే చేస్తాను. దానిలో ఆయనే హీరో. రవితేజకు నేను చెప్పిన కథ వేరేది. అది పూర్తి స్థాయి కామెడీ సినిమా. ఈ రెండింటికీ సంబంధం లేదు” అంటూ క్లారిటీ ఇచ్చాడు.
కాగా ప్రస్తుతం ఈ కుర్ర డైరెక్టర్ వెంకీ అండ్ నాగచైతన్య కాంబినేషన్లో చేయబోయే సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడట. ఆ సినిమాలో ఇద్దరూ కూడా నిజ జీవితం తరహాలోనే మామా అల్లుళ్ళ పాత్రల్లో నటించనున్నారు.ఈ సినిమా తరువాత నాగ్ తో ఆయన చేయనున్న బంగార్రాజు ప్రారంభం కానుందేమో!
నాగార్జున-బంగార్రాజు, రవితేజ-కామెడీన..
మరిన్ని వార్తల కోసం తెలుగు లైవ్స్ వాట్సాప్ లో ఫాలో అవ్వండి