Newsఅమ్మాయిలకు అలాంటి వాళ్లంటేనే చాలా చాలా ఇష్టమట!!

అమ్మాయిలకు అలాంటి వాళ్లంటేనే చాలా చాలా ఇష్టమట!!

ఆడవారి మనసు లోతు మహా సముద్రపు లోతు కన్నా ఎక్కువ… ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.. ఆడవారిని అర్థం చేసుకోవటానికి ఒక మనిషి జన్మ సరిపోదు అంటూ ఆడవారిపై మన మహా కవులు ఎన్నో చమక్కులు విసిరారు. అయితే అమ్మాయిలకి ఎలాంటి వాళ్ళు అంటే ఇష్టమో ఈ మధ్య కొన్ని ప్రయోగాలద్వారా కనుగొన్నారంట.

మీకు గర్ల్ ఫ్రెండ్ లేదని చాలా బెంగగా ఉందా అయితే మేము చెప్పే ఫార్ములా అప్లై చెయ్యండి మీరు మీకు నచ్చే ఒక అమ్మడి గుండెలో తప్పక స్తానం సంపాదిస్తారు. మీకు ముఖ్యంగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే హాస్య చతురత, వ్యంగ్యంగా మాట్లాడగలగటం, నిశ్శబ్ధంగా ఉన్నచోట నవ్వులు పూయించే నేర్పరితనం కనక మీరు అలవర్చుకుంటే ఇక మీకు గర్ల్ ఫ్రెండ్ దొరికిందన్నమాటే. ఎందుకంటే అమ్మాయిలకు మాటలన్నా, మాట్లాడటమన్నా ఇష్టం అంట . ఇష్టమైన వాడితో గంటలకొద్దీ కబుర్లు పెట్టాలని ప్రతీ అమ్మాయికి ఉంటుందంట. అలాగని సోదిలా కాకుండా కొంత మాటలని.. నవ్వించే విధంగా మలిచే నేర్పు ఉండాలి. కాబట్టి అమ్మాయిల దగ్గర సీరియస్, టెన్షన్, కోపం వదిలేసి చక్కగా నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడండి. వారి హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకోండి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news