టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కేరీర్ ఆరంభంలో వరుస హిట్లతో దూసుకుపోయారు. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్లో విఆర్ ప్రతాప్ దర్శకత్వంలో వచ్చిన నిన్ను చూడాలని సినిమాతో ఎన్టీఆర్ హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు. అంతకుముందే బాల రామాయణం లాంటి సినిమాల్లో చిన్నప్పుడే నటించాడు. అయితే హీరోగా మాత్రం నిన్ను చూడాలని సినిమాతో తొలిసారిగా ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. రాజమౌళి దర్శకుడిగా పరిచయం అయిన స్టూడెంట్ నెంబర్ వన్ ఎన్టీఆర్ కు రెండో సినిమా. ఈ సినిమా సూపర్ హిట్ అయింది.
స్టూడెంట్ నెంబర్ వన్ అప్పట్లో తెలుగు నాట ఒక ఊపు ఊపేస్తుంది. ముఖ్యంగా కాలేజీ కుర్రాళ్ళు అమ్మాయిలు ఎన్టీఆర్ యాక్టింగ్‌కు ఫిదా అయిపోయారు. సినిమా కథ కూడా చాలా కొత్తగా అనిపించింది. లా చదివే స్టూడెంట్ జైలులో ఉండి కాలేజీకి వచ్చి చదవటం ఏంటన్నది ? ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఎన్టీఆర్ డ్యాన్సులతోపాటు కీరవాణి పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. హీరోయిన్ గజాల చిలిపి ప్రేమ సన్నివేశాలు, తండ్రి సెంటిమెంట్ ఇవన్నీ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోయాయి.
సినిమా లేట్ రిలీజ్‌లో కూడా 100 రోజులు ఆడగా, కొన్ని కేంద్రాల్లో 175 రోజులు కూడా ఆడింది. ఇక ఎన్టీఆర్ హీరోగా పరిచయం అయిన 2001 లోనే డిసెంబర్లో సుబ్బు సినిమాతో మూడోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రుద్రరాజు సురేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా 21 డిసెంబర్ 2001న రిలీజ్ అయింది. సినిమాలో పాటలు అన్నీ ప్రేక్షకాదరణ పొందాయి. ఎన్టీఆర్‌కు జోడీగా సోనాలి జోషీ హీరోయిన్‌గా పరిచయం అయ్యింది.
ఈ సినిమా షూటింగ్ టైంలో దర్శకుడు సురేష్ వర్మ తనతో మిస్ బిహేవ్ చేశాడని సోనాలి ఆరోపించడం ఇండస్ట్రీలో సంచలనం రేపింది. న్యూజిలాండ్‌లో ఈ సినిమా పాటలు షూట్ చేస్తున్నప్పుడు ఈ సంఘనట జరిగింది. ఓ రోజు రాత్రి సురేష్‌వర్మ తాగి వచ్చి గజాలా రూమ్ తలుపు కొట్టాడట. ఆమె తలుపు తీసిన వెంటనే సురేష్‌వర్మ తనతో రాత్రి గడపాలని.. కోరగా ఆమె తిరస్కరించడంతో సురేష్‌వర్మ ఆమెపై పగబట్టి ఆ మరుసటి రోజు సెట్స్‌లో ఆమెను బాగా ఇబ్బంది పెట్టాడట.
అయితే ఆ తర్వాత సోనాలీ జోషికి ఇండస్ట్రీ పెద్దల నుంచి ఒత్తిళ్లు, వార్నింగ్‌లు వెళ్లాయట. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేకపోయతే నీకు లైఫ్ లేకుండా చేస్తామని బెదిరించారట. తర్వాత ఆమె ఒకటి రెండు సినిమాలు చేసినా టాలీవుడ్ నుంచి మాయం అయ్యింది. ఆమెకు అవకాశాలు ఇస్తే ఏదో ఒక డిస్టబెన్స్ క్రియేట్ చేస్తుందన్న సాకుతో ఆమెను కావాలనే తొక్కేశారన్న ప్రచారం అప్పట్లో వినిపించింది. అందుకే ఆమె పెద్దగా సినిమాలు చేయకుండానే ఇక్కడ మూటా ముళ్లు సర్దేసుకుంది.