సినిమా రంగంలో ఉన్న సెలబ్రిటీల్లో ఎక్కువమంది ప్రేమ వివాహాలకే మొగ్గుచూపుతూ ఉంటారు. హీరో, హీరోయిన్లు దర్శకులు ఎవరైనా ఇంట్లో కుదిర్చిన పెళ్లి కంటే ప్రేమించి తమ జీవితాన్ని అవగాహన చేసుకున్న వారిని పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఇలా పెళ్లి చేసుకున్న వారిలో కొందరు మనస్పర్ధలతో త్వరగా విడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. హీరోలు.. హీరోయిన్లు మాత్రమే కాదు దర్శకులు, ఇతర టెక్నీషియన్లు కూడా ఇటీవల కాలంలో ప్రేమ వివాహాలు చేసుకోవడం కామన్ అయిపోయింది.
టాలీవుడ్ స్టార్ దర్శకుల్లో దర్శకధీరుడు రాజమౌళి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్… సీనియర్ దర్శకులలో దర్శకరత్న దాసరి నారాయణరావు ఇలా చాలామంది ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమాలో తీసిన ఇద్దరు దర్శకులు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఈ ఇద్దరు ప్రేమ వివాహం ఆసక్తిగా ఉంటుంది. వీరి ప్రేమ పెళ్లిలో ఎన్నో ట్విస్టులు కూడా మనకు కనిపిస్తాయి.
కేఎస్. రవీంద్ర ( బాబి ) :
పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు బాబి. బాబి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక బాబి స్వస్థలం గుంటూరు జిల్లా. బాబి ప్రేమ వివాహం చిత్రంగా జరిగింది. బాబి వాళ్ల ఫ్రెండ్, బాబి భార్య ఫ్రెండ్ లవర్స్. వారు ప్రేమించుకునే క్రమంలో వారిని కలిపేందుకు వీరిద్దరు స్నేహితులు అయ్యారు.
వాళ్లిద్దరు పార్కులో ఏకాంతంగా కలుసుకునే క్రమంలో వీరు బయటే ఉండేవాళ్లట. అలా మాటలు కలవడం. తర్వాత స్నేహితులు కావడం.. చివరకు వారు ప్రేమికులు అవ్వడం జరిగింది. విచిత్రం ఏంటంటే ఏ స్నేహితులను కలిపేందుకు బాబి, వాళ్ల భార్య ట్రై చేశారో వాళ్ల ప్రేమ ఫెయిల్ అయ్యి.. వారు విడిపోయారు.. వీరు ప్రేమికులుగా మారి పెళ్లి చేసుకున్నారు. మరి ఇంతకు మించిన విచిత్రమైన విధిరాత ఉంటుందా ? బాబి దంపతులకు వైష్ణవి అనే ఓ పాప కూడా ఉంది. మరో ట్విస్ట్ ఏంటంటే బాబి కాపు వర్గానికి చెందిన వ్యక్తి కాగా.. బాబి భార్యది కమ్మ సామాజిక వర్గం.
సాగర్ కె. చంద్ర :
అప్పట్లో ఒకడుండేవాడు, అయ్యారే లాంటి రెండు వైవిధ్యమైన సినిమాలు తీసి మూడో సినిమాతోనే ఏకంగా పవన్ కళ్యాణ్‌ను భీమ్లానాయక్ సినిమాతో డైరెక్ట్ చేశాడు సాగర్ కె. చంద్ర. సాగర్ కె. చంద్ర స్వస్థలం నల్లగొండ. సాగర్ బీటెక్ పూర్తి చేసి అమెరికాలో మాస్టర్స్ చేసేందుకు వెళ్లాడు. అయితే అక్కడ సినిమాలపై ఆసక్తితో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి కోర్సు పూర్తి చేశాడు. ఇండియాకు తిరిగి వచ్చి ఎన్నో కష్టాలు పడి సినిమా రంగంలో నిలదొక్కుకున్నాడు.
సాగర్ రెడ్డి భార్య పేరు గీతా రెడ్డి. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లే. గీత కూడా సాగర్ లాగానే బీటెక్ కంప్లీట్ చేసింది. ఆ తర్వాత మాస్టర్స్ చేసిన ఆమె కొన్నాళ్ల పాటు ఉద్యోగం చేసి ఇప్పుడు హౌస్‌వైఫ్‌గానే ఉంటోంది. అయితే సాగర్ – గీత ఎంగేజ్మెంట్ అయ్యాక పిచ్చ పిచ్చగా ప్రేమించుకున్నారట. ముందు ఒకరికొకరు తెలియకపోయినా ఎంగేజ్మెంట్ తర్వాత వీరు డీప్ లవర్స్ అయ్యారు