ఎంతో ప్రతిభ ఉన్న నటీమణుల్లో హీరోయిన్ రేవతి ముందు వరుసలో ఉంటుంది. ఆమె హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, డైరెక్టర్‌గా మలయాళ, తమిళ, తెలుగు సినిమాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. చిన్నతనం నుంచి భరతనాట్యం నేర్చుకున్న రేవతి అనుకోకుండా హీరోయిన్ గా మారింది. ఒక రోజు స్కూల్లో జరిగిన ర్యాంప్ వాక్ ఫోటోలు ఒక మ్యాగజైన్‌పై రావడంతో ఆ ఫోటోలు చూసినా భారతి రాజా అందులో ఉన్న రేవతికి పిలిచి అవకాశం ఇచ్చారు. రేవతి అసలు పేరు ఆశ. సినిమాలో ఆమె పేరుని రేవతిగా మార్చాడు భారతి రాజా.
అలా మొదట తమిళ సినిమా లో హీరోయిన్ గా నటించింది. ఇక అక్కడ మొదలైన రేవతి ప్రస్థానం నేటి వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతోంది. ఆమె తమిళ, మలయాళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో అనేక సినిమాల్లో నటించింది. ఇక దర్శకురాలిగా కూడా మారి ఐదు సినిమాలకు దర్శకత్వం చేపట్టింది. సింగర్ గా, టెలివిజన్ యాక్టర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఆమె సినిమా పరిశ్రమలో డైనమిక్ లేడీగా ఎదిగిన తీరు అనిర్వచనీయం. సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న సురేష్ చంద్ర మీనన్‌తో ప్రేమలో పడి అతనిని పెళ్లి చేసుకుంది.
పెళ్లయ్యాక కూడా రేవతి హీరోయిన్ గా కొనసాగింది. అయితే 15 ఏళ్ల పాటు బాగానే కాపురం చేసిన పిల్లల లేకపోవడంతో గొడవలు మొదలయ్యాయి. ఆ తర్వాత కొన్నాళ్ళకు విడాకులు తీసుకున్నారు. దాదాపు 10 ఏళ్ల పాటు విడిగా ఉండి రేవతి – సురేష్ విడాకులు తీసుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక రేవతి తన భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత మహి అనే ఒక అమ్మాయికి ఐవిఎఫ్ పద్ధతి ద్వారా జన్మ ఇచ్చింది. ఇప్పుడు తల్లి పాత్రల్లో పలు భాషల్లో నటిస్తున్న రేవతి మీ టూ ఉద్యమం బలంగా వినిపిస్తున్న సమయంలో సోషల్ మీడియాలో ఒక సంచలన పోస్ట్ చేసి అందరికి షాక్ ఇచ్చింది.
ఆమె హీరోయిన్ గా ఫుల్ పీక్ లో ఉన్న సమయంలో ఒక హోటల్ లో ఉండాల్సి వచ్చిందట. ఆ రోజు ఆ హోటల్లో గది బయట నుంచి ఒక అమ్మాయి అర్ద రాత్రి సమయంలో డోర్ గట్టిగా కొడుతూ ఉందట. ఇంత రాత్రి పూట ఎవరు ? డోర్ కొడుతున్నారో తెలియక భయం భయంగా వెళ్లి డోర్ తీసిందట. ఆ టైంలో రేవతి తో పాటు ఆమె బామ్మా కూడా ఉందట. ఇక డోర్ తెరిచి చూస్తే 17 ఏళ్ళ మైనర్ అమ్మాయి తనను ఎవరో తరుముకుంటూ వస్తున్నారని చెప్పిందట. దాంతో ఆ అమ్మాయిని ఆ రోజు రాత్రి తన గదిలోనే ఉంచుకుందట రేవతి.
ఉదయం ఆ అమ్మాయి వెళ్ళిపోయినా ఆ రోజు ఆమెకు ఏం జరిగిందో అని చాల కంగారు పడిందట. ఒక చిన్న పిల్లను కారులో ఎత్తుకు వచ్చి తరుముకుంటూ వచ్చింది ఎవరు ? అని అడిగిన ఆ అమ్మాయి ఏమి చెప్పకపోవడం తో రేవతి కూడా ఊరుకుందట. కానీ ఆ సంఘటన జరిగిన 25 ఏళ్లకు రేవతి ఈ సమయంలో బయట పెట్టింది. ఆ తర్వాత ఆ అమ్మాయికి ఏం జరిగిందో రేవతికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదట. అయితే ఈ వార్త తమిళ మీడియాను ఓ కుదుపు కుదపడంతో ఆ వార్తలపై సంజాయిషీ ఇవ్వాల్సి వచ్చింది రేవతి.