సాధారణంగా మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అంటారు ఇది ఒక నానుడి. అయితే ఈ నానుడి నిజం కావాలంటే వారు కవల పిల్లలు అయ్యి ఉండాలనేది మరొక వాస్తవం. కొన్నిసార్లు ఒకరితో ఒకరికి సంబంధం లేకపోయినా కాస్త పోలికలు దగ్గరగా ఉంటాయి. అయితే మన టాలీవుడ్ విషయానికొస్తే కొంత మంది అక్క చెల్లెలు హీరోయిన్స్ గా రాణించి లేదా ఒకరు ఇండస్ట్రీలో ఉండి మరొకరు లేకపోయినా అచ్చం కవల పిల్లల్ల ఉండే కొంతమంది హీరోయిన్స్ ఉన్నారు. వారి గురించి తెలుసుకుందాం.
సాయి పల్లవి – ఆమె చెల్లెలు పూజ :
సాయి పల్లవి… తెలుగు, తమిళం, మలయాళ ఇండస్ట్రీలో చాలా పెద్ద హీరోయిన్ గా కొనసాగుతుంది. ఆమె చేసిన సినిమాలు, సాధించిన అవార్డులు, ఆమెకున్న క్రేజ్ గురించి మనందరికీ తెలిసిందే. అయితే సాయి పల్లవికి ఒక చెల్లెలు ఉంది. ఆమె పేరు పూజ. ఆమె కూడా నటిగా రాణిస్తోంది. ఇక చూడడానికి సాయి పల్లవి, పూజ ఇద్దరు కూడా అచ్చం కవల పిల్లలాగానే ఉంటారు. ఒకరిని చూస్తే మరొకరిని పోల్చుకోవడం చాలా కష్టం. అంతలా వారు ఒకేలా కనిపిస్తూ ఉంటారు.
ప్రీతి – జూనియర్ శ్రీదేవి :
హీరోయిన్ మంజుల అలాగే నటుడు విజయ్ కుమార్ కూతుర్లు దాదాపు అందరూ ఒకేలా కనిపిస్తారు. దాంట్లో చివరి అమ్మాయిలు అయినా ప్రీతి – జూనియర్ శ్రీదేవి పూర్తిగా కవల పిల్లల్లా ఒకేలా కనిపిస్తారు. ఇక ప్రితీ టాలీవుడ్ లో రుక్మిణి కళ్యాణం వంటి సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అలాగే ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ సరసన నటించి జూనియర్ శ్రీదేవి సైతం టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. వీరిద్దరూ చూడడానికి ఒకేలా ఉండి మన కళ్ళనే మోసం చేస్తారు.
శృతిహాసన్ – అక్షర హాసన్ :
కమల్ హాసన్ కూతుర్లైన శృతి హాసన్ ఆమె చెల్లి అక్షర హాసన్ ఇద్దరూ కూడా ఒకేలా ఉంటారు. వారి కళ్ళు, హావాభావాలు , ముక్కు తీరు అన్ని కూడా ఒకేలా ఉంటాయి. కాస్త హైట్ లో తేడా ఉంటుంది కానీ ఒకరిని చూస్తే ఒకరిని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. వాస్తవానికి వీరిద్దరూ ఆమె తల్లి సారిక లాగా అచ్చుగుద్దినట్టుగా ఉంటారు. సారిక, శృతి, అక్షర ముగ్గురు ఒకే పోలికలతో ఉంటారు.
ఊర్వసి, కల్పన, కలారంజని :
వీరు ముగ్గురు కూడా అక్క చెల్లెలు.. మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆ తర్వాత తమిళం, తెలుగు వంటి అన్ని సౌత్ ఇండియా సినిమాల్లో పాపులర్ నటీమణులుగా కొనసాగారు. ఇక వీరు ముగ్గురు సైతం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి చాలా ఏళ్లపాటు తమ కెరియర్ ను కొనసాగించారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే వీరు ముగ్గురు కూడా చూడడానికి ఒకేలా ఉంటారు. ఒకేలా ఉండి అనేక సినిమాలో నటించడం అంటే చాలా పెద్ద విషయమే కదా.
ఇక వీరు మాత్రమే కాకుండా జయసుధ ఆమె చెల్లి సుభాషిణి, అలనాటి హీరోయిన్స్ అంబికా మరియు రాధా, చైల్డ్ ఆర్టిస్టులుగా ఫెమస్ అయినా షాలిని మరియు షామిలి, సంజన గల్రాని మరియు నిక్కీ గల్రాని వంటి వారు కూడా కాస్త సిమిలర్ ఫీచర్స్ తో కావాలా పిల్లల పోలికలు కలిగి ఉంటారు.