బాయ్స్ సినిమాతో తెరంగేట్రం చేసిన సిద్దార్ధ్ , తర్వాత తెలుగు లోనే ఎక్కువ సినిమాలు తీసాడు . బొమ్మరిల్లు తో తాను ఇక తెలుగు ఇండస్ట్రీ కే పరిమితమవుతానని ఫిక్స్ అయ్యిపోయాడు హీరో సిద్దార్ధ్ . కొన్ని సినిమాలు ప్లాప్ కావడంతో మల్లి తమిళ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు . అక్కడ ఫెయిల్ అయ్యాడు .
హీరోగా ప్రేక్షకుల మదిలో ఎప్పుడో దూరం అయిపోయిన సిద్దార్థ్ ఒక ప్రయోగాత్మక నటుడుగా అందరికీ గుర్తుండే ప్రయత్నం చేస్తున్నాడు. రీసెంట్ గా కొన్ని హారర్ తో పాటు అనేక చిత్రాలు షూటింగ్ లు జరుపుతున్నాడు సిద్దార్థ్.
అయితే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో మనం సినిమా గురించి చెప్పుకొచ్చాడు సిద్దు . ఈ కథ కోసం విక్రమ్ కుమార్ ముందుగా తననీ .. కె. విశ్వనాథ్ ను .. వెంకటేశ్ ను అనుకున్నారని చెప్పాడు. . అయితే ఆ తరువాత ఆయన ఈ కథను అక్కినేని ఫ్యామిలీ దగ్గరికి తీసుకెళ్లారని అన్నాడు. అందువలన ఈ సినిమాలో తాను చేయవలసిన పాత్రను మిస్సయ్యానని చెప్పుకొచ్చాడు.నిజానికి నాగ చైతన్య చేసిన పాత్ర తానూ చేయవల్సిందని చెప్పాడు. ఈ సినిమా వచ్చిన చాలా సంవత్సరాల తరవాత హీరో సిద్దార్థ్ ప్రత్యేకంగా ఈ విషయం ఇంటర్వ్యూ లో నొక్కి మరీ చెప్పడం ఆశ్చర్యంగా ఉంది.