అంత మోసం ..దగా ..నన్ను మోసం చేశారు.. చీట్ చేశారు.. నన్ను వాడుకొని వదిలేసారు అంటూ లబోధిబో అంటుంది గలాటా గీతు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పరిచయమై ఆ తర్వాత జబర్ధస్త్ కమెడియన్ గా గుర్తింపు పొందిన గీతూ రాయల్ సోషల్ మీడియాలో తనదైన స్టైల్ లో రివ్యూస్ ఇస్తూ కామెంట్స్ చేస్తూ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కాగా రీసెంట్గా బిగ్ బాస్ 6 లో వన్ ఆఫ్ ద టాప్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టి.. చేసిన హంగామా ..రచ్చ ..అల్లరి అంతా ఇంతా కాదు .
ఒకానొక టైంలో గీతూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే బాగుండు రా బాబు అని దండం పెట్టేసుకున్నారు కంటెస్టెంట్స్ . అదే కంటెస్టెంట్స్ గీతు హౌస్ నుండి వెళ్ళిపోతుంటే కన్నీరు పెట్టుకున్నారు. తన మాటలతో వాక్చాతుర్యంతో జనాలని టెంప్ట్ చేసి మెల్ట్ చేస్తుంది. అయితే గీతూ డబుల్ గేమ్ ఆడలేదన్న విషయం అందరికీ తెలిసిందే . ఉన్నది ఉన్నట్లు మాట్లాడి.. గేమ్స్ ఆడింది. ఆ విషయాలు పెద్దగా జనాలకి నచ్చలేదు . అందరిలాగా పులిహోర కలిపే బ్యాచ్ అయితే గీతూ కూడా ఇప్పటికి హౌస్ లోనే ఉండేదేమో . ఏది ఏమైనా సరే గీతూ హౌస్ నుంచి బయటికి వచ్చి మంచి పని చేసింది అంటున్నారు ఆమె ఫ్యాన్స్.
అలాంటి చెత్త షోలో గీతూ వెళ్లి పరువు తీసుకోకుండా ఉండడమే బెటర్ అంటున్నారు . కాగా రీసెంట్గా ఓ వీడియో పోస్ట్ చేసింది గీతూ. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ..ఆమె దారుణంగా మోసపోయానని చెప్పుకొచ్చింది . “బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేవారు కొందరు పీఆర్ లని పెట్టుకుంటారు అన్న సీక్రెట్ ను బయట పెట్టింది . అందరి లాగానే నేను కూడా పీఆర్ ని మాట్లాడుకున్నానని.. 25 వేలు నా దగ్గర నుండి తీసుకొని నన్ను ప్రమోట్ చేయకుండా చెక్కేసాడని ..నా డబ్బులు మొత్తం లాస్ అయిపోయాయని చెప్పుకొచ్చింది. గత సీజన్లో చాలామంది అలా పిఆర్ ను మాట్లాడుకున్నారని . కానీ ఎవరు మోసపోలేదని నేనే మోసపోయానని ..బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక మా ఫ్యామిలీ సపోర్ట్ మాత్రమే నాకు దక్కిందని ..స్నేహితులు కూడా తనను మోసం చేశారని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ గీతూ రాయల్ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఏది ఏమైనా సరే బిగ్ బాస్ అంటే మరోసారి దారుణం , నీచమంటూ చెప్పకనే చెప్పేసింది గీతూ.