ప్రజెంట్ సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ గా మారింది. అన్ని వెబ్ సైట్ల లోను.. ప్రముఖ చానల్స్ లోను ..హెడ్లైన్స్ లో నిలుస్తుంది ఈ వార్త . నటి కనిష్క సోనీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . చేసిన ప్రాజెక్ట్స్ కన్నా కాంట్రవర్షీయల్ కామెంట్స్ తోనే ఎక్కువగా పాపులర్ అయింది . కాగా ప్రస్తుతం న్యూయార్క్ లో చిల్ అవుతున్న కనిష్క ..రీసెంట్ ఫోటోస్ సోషల్ మీడియాని షేక్ చేశాయి .అంతగా షేక్ చేయడానికి ఈ ఫోటోలో ఏముంది అనుకుంటున్నారా ..?
ఈ ఫోటోలో ఆమె పొట్ట పెద్దదిగా కనిపిస్తూ ఉండడం . చూడడానికి బేబీ బంపులా ఉండడం షాకింగ్ కి గురిచేసింది. బేబీ బంప్ అయితే ఏంటి.. ఆడవాళ్లకు సహజంగానే ప్రెగ్నెంట్ అయితే బేబీ పంపు వస్తుందిగా అని అనుకుంటున్నారా.. ఆఫ్ కోర్స్ అది నిజమే. ప్రెగ్నెంట్ అయితే ఆడవాళ్లకు కచ్చితంగా బేబీ బంపు వస్తుంది . అది మంచిదే అయితే కచ్చితంగా భర్త పక్కన ఉండగానే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది . కానీ ఇక్కడ సెల్ఫ్ మ్యారేజ్ చేసుకున్న ఈ కనిష్క సోనీ ప్రెగ్నెంట్ ఎలా అయ్యింది అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ నడుస్తుంది.
ఇందుకు కారణం ఎవరు అని వెటకారంగా కూడా ప్రశ్నించారు . దీంతో ఈ ట్రోలింగ్ బాధ తట్టుకోలేక ఎట్టకేలకు తన పెద్ద పొట్ట గురించి ఓపెన్ అప్ అయింది . ఆమె స్పందిస్తూ ..”నేను సెల్ఫ్ ప్రెగ్నెంట్ కాదు. అసలు నేను ప్రెగ్నెంట్ ఏ కాదు . ఇదంతా యూఎస్ లోని డెలీషియస్ బర్గర్ పిజ్జా కారణంగా పెరిగిన పొట్ట.. అంతే దీనికి కారణం ఎవరు కాదు.. కానీ ఐ యాం లివింగ్ ఇట్ “అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు . మరికొందరు సెల్ఫ్ మ్యారేజ్ లాగే సెల్ఫ్ ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకున్నాము అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో కనిష్క సోనీ ప్రెగ్నెన్సీ మేటర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.