Moviesమీ కోసం యేడాది పాటు ఫ్రీగా ఎన్టీఆర్ సినిమాలు... వెంట‌నే ఆ...

మీ కోసం యేడాది పాటు ఫ్రీగా ఎన్టీఆర్ సినిమాలు… వెంట‌నే ఆ ఊరు వెళ్లిపోండి…!

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న వేళ ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలిలో యేడాది పాటు ఉత్స‌వాలు నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే క‌ళ‌ల‌కు పుట్టిల్లు అయిన తెనాలికి ఇప్పుడు శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల్లో ప్ర‌త్యేక‌త‌ను నిలుపుకుంటోంది. ఈ ప‌ట్ట‌ణంలోని పెమ్మసాని థియేటర్ ప్రత్యేక కార్యక్రమాలకు వేదికైంది. ఆయన నటించిన చిత్రాలను ఏడాదిపాటు థియేటర్లో ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. ఒకప్పుడు ఈ హాల్ యజమాని ఎన్టీఆర్ కావటమే ఈ థియేటర్ ప్రత్యేకత.

వెండితెర కథానాయకుడిగా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి నందమూరి తారక రామారావు. సినిమా నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా సినిమా రంగంపై ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారు. ఆయనకు సొంతంగా సినిమా థియేటర్లు కూడా ఉండేవి. వాటిలో ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలిలోని రామకృష్ణ థియేటర్ ఒకటి. ప్ర‌స్తుతం ఇది పెమ్మ‌సాని పేరుతో న‌డుస్తోంది.

ప్రస్తుతం ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా తెనాలిలో ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఎన్టీఆర్ నటించిన చిత్రాలను ఏడాదిపాటు ఉచితంగా ప్రదర్శించాలని నిర్ణయించారు. ఆ సినిమాల ప్రదర్శనకు ఈ థియేటర్‌ను ఎంచుకున్నారు. సినిమాలు చూసేందుకు వస్తున్న ప్రేక్షకుల్ని చూస్తుంటే ఎన్టీఆర్‌పై ఆ త‌రంలోనే కాదు ఈ త‌రం జ‌నాల్లోనూ అభిమానం ఇప్పటికీ తగ్గలేదనిపిస్తోందని చెబుతున్నారు.

ఎన్టీఆర్ నటించిన మంచి సినిమాలన్నింటికీ ప్రతి ఆటకి రోజు 400 మందికి తగ్గకుండా వస్తున్నారు. మా థియేటర్ కెపాసిటీ 470. డ్రైవర్ రాముడు, వేటగాడు.. ఇలా మరి కొన్ని సినిమాలకు చాలా మంది జనాలు చూడడానికి వచ్చి.. థియేటర్లో స్థలం లేకుండా ఉండటంతో 200 మంది తిరిగి ఇంటికి వెళ్లారు అని థియేటర్ నిర్వాహ‌కుడు పెమ్మసాని పోతురాజు తెలిపారు.

సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 8 గంటల 30నిమిషాలకు మొదటి ఆటగా ఎన్టీఆర్ సినిమాలు ప్రదర్శిస్తున్నారు. సినీరంగానికి చెందిన ఓ ప్రముఖుడికి ప్రతినెలా ఎన్టీఆర్ అవార్డు అందజేస్తున్నారు.ఎన్టీఆర్ సొంత థియేటర్‌లో ఆయన చిత్రాలన్నింటినీ ప్రదర్శించడం ద్వారా.. ఆయనకు ఘనమైన నివాళి అర్పిస్తున్నట్లు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news